పుట:Mana-Jeevithalu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉండకుండా జాగ్రత్త పడతాం. అది ఎంతో బాధాకరంగా, ఖండితంగా ఉంటుంది. నిత్యం సర్దుకు పోవల్సిన అగత్యం - అంటే, గమనించవలసిన అగత్యం ఉంటుంది. గమనించటం అంటే జాగ్రత్తగా వీక్షించటం, ఇందుకు బదులు మనల్ని ఓదార్చాలనీ, నిద్రపుచ్చాలనీ, మందకొడిగా చెయ్యాలనీ అనుకుంటాం. వార్తాపత్రికలూ, సచిత్రపత్రికలూ, పుస్తకాలూ చదవటానికి అలవాటు పడిపోవటంతో, వాటి ప్రభావానికి మందకొడితనం ఏర్పడుతుంది. తాగటం, పూజ చేయటం లాగే చదవటం కూడా తప్పించుకునేందుకొక బ్రహ్మాండమైన మార్గం - జీవితంలోని బాధనుంచి తప్పించుకోవాలనుకుంటాం. దానికి మందకొడితనం బాగా పనిచేసే మార్గం; సమర్ధనల మూలంగా, ఎవరో ఒక నాయకుణ్ణి అనుసరించటం మూలంగా, ఒక ఆదర్శం మూలంగా, ఏదో సాధించిన దానితోగాని, పేరుతోగాని, లక్ష్యంతోగాని ఐక్యం చెందటం మూలాన్ని ఏర్పడిన మందకొడితనం అది. మనలో చాలామంది అలా మందకొడిగా అవాలనే కోరుతారు. అలవాటైనది మనస్సుని నిద్రపుచ్చుతుంది. అలవాటైన క్రమశిక్షణా, సాధనా, ఏదో అవాలని నిలకడగా చేసే ప్రయత్నం - ఇవన్నీ సున్నితత్వాన్ని పోగొట్టే గౌరవనీయమైన మార్గాలు.

"సున్నితంగా ఉంటే జీవితంలో ఏం సాధించగలరు? ముడుచుకు పోయి, వాడిపోతాం. ప్రయోజనకరమైన కార్యమే ఉండదు."

మందకొడిగా, సున్నితత్వం లేకుండా ఉన్నవాళ్లు ప్రపంచానికేం చేస్తున్నారు? వాళ్లు చేసే కార్యం ఏవిధంగా "ప్రయోజనకరం? "యుద్ధాలూ, లోపలా బయటా కూడ గందరగోళం, నిర్దాక్షిణ్యతా, తమకీ ప్రపంచానికీ కూడా అధికమవుతూన్న దుఃఖం. జాగ్రత్తగా వీక్షించకుండా ఉండేవారి చర్య విధ్వంసానికీ, భౌతికరక్షణ లేకపోవటానికీ, వినాశానికీ దారితీయక తప్పదు. కాని, సున్నితత్వం సులభంగా రాదు. సామాన్యమైన దాన్ని అర్థం చేసుకోవటమే సున్నితత్వం. అది చాలా క్లిష్టమైనది. అది వెనక్కి తప్పుకోవటం, ముడుచుకు పోవటం, ప్రత్యేకంగా వేరవటం కాదు. సున్నితత్వంతో ప్రవర్తించడమంటే ప్రవర్తించేవాడి సమస్త ప్రక్రియనీ తెలుసుకుంటూ ఉండటం.

"నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా కాలం