పుట:Mana-Jeevithalu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందకొడితనం

229

స్నేహితులకేసి చేతులూపుతున్నారు. పెద్ద రొద చేస్తూ వంతెనని దాటడం మొదలుపెట్టాం. విశాలంగా వంపుతిరిగిన నదిమీద ఉన్న వంతెన అది. ఆ జాగాలో నది కొన్ని మైళ్ల వెడల్పున ఉంది. అవతలి ఒడ్డు మసక వెలుతురులో కొద్దిగా కనిపిస్తోంది. రైలు వంతెన కున్న కడ్డీలను లెక్క పెడితే యాభైఎనిమిది ఉన్నాయి రెండు తీరాలకీ మధ్య. ఆ నీళ్లు ఎంత అందంగా ఉన్నాయి. నిశ్శబ్దంగా, నిండుగా, లోతుగా ప్రవహిస్తూ! ఇసుక తిప్పలు దూరం నుంచి హాయిగా చల్లగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పట్టణమూ, దాని చప్పుళ్లూ దుమ్మూ, మురికీ వెనక వదిలేసి, స్వచ్ఛమైన సాయంకాలపు గాలి కిటికీల్లోంచి వస్తోంది. కాని, పొడుగాటి ఆ వంతెన దాటగానే మళ్లీ దుమ్ముంటుంది.

క్రింద పక్కమీద ఉన్నాయన తెగమాట్లాడుతున్నాడు. మేము ఇంకా రాత్రంతా గడపాలి కాబట్టి ప్రశ్నలడిగే హక్కు తనకుందనుకున్నాడు. బాగా ఒడ్డూ పొడుగ్గా ఉన్నాడు. పెద్ద పెద్ద చేతులూ, పాదాలతో. తన గురించీ, తన జీవితం, తన సమస్యలూ, తన పిల్లల గురించీ, మాట్లాడటం మొదలు పెట్టాడు. భారతదేశం కూడా అమెరికాలాగే అభివృద్ధి పొందాలన్నాడు, ఈ జనాభా పెరుగుదలని అదుపులో ఉంచాలన్నాడు; ప్రజలు తమ బాధ్యతను తెలుసుకునేట్లు చెయ్యాలన్నాడు. రాజకీయ పరిస్థితి గురించీ, యుద్ధం గురించీ మాట్లాడి, తను చేసిన ప్రయాణాల గురించి చెప్పటంతో ముగించాడు.

మనం ఎంతగా సున్నితత్వం లేకుండా, చురుకుతనం లేకుండా, తగినంత ప్రతిక్రియ లేకుండా ఉంటాం - గమనించటానికి ఎంతగా స్వేచ్ఛ లేకుండా ఉంటాం! సున్నితత్వం లేకుండా మృదుత్వం ఎలా ఉంటుంది. చురుకుగా గ్రహించటం ఎలా ఉంటుంది. గ్రహణ శక్తి ఎలా ఉండగలదు. శ్రమలేని అవగాహన ఎలా సాధ్యం? శ్రమ పడటమే అవగాహన కాకుండా ఆటంకం కలిగిస్తుంది. ఎంతో సున్నితత్వం ఉన్నప్పుడే అవగాహన కలుగుతుంది. కాని, సున్నితత్వం అలవరచుకుంటే వచ్చేది కాదు. అలవరచుకున్నది అసహజ లక్షణమే, కృత్రిమంగా ఉన్న పై మెరుగే. ఈ పైపూత సున్నితత్వం కాదు. సున్నితత్వం సంస్కృతి ఫలితం కాదు. ప్రభావ ఫలితం కాదు. సున్నితంగా. విశాల హృదయంతో ఉండే స్థితి అది. బాహాటంగా ఉన్నదే లోనున్నది, తెలియనిది, అభేద్యమైనది. కాని, మనం సున్నితంగా