పుట:Mana-Jeevithalu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తన్ను తాను అనేక విధాల నాశనం చేసుకోకుండా ఉంటే అతడు జీవించి ఉంటాడు. కారణం, ఫలితం నిశ్చితమైనవీ, స్థిరమైనవీనా? కారణం, ఫలితం - అని విడిగా అనటం రెండూ స్థిరంగా ఉండేవనా? కారణం ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా? ఫలితం మార్చటానికి వీల్లేనట్లుగా ఉంటుందా? కారణం, ఫలితం, నిజానికి ఒకటి తరవాత ఒకటి సాగుతూ ఉండే ప్రక్రియ కాదా? ఈ రోజు నిన్నటి ఫలితం. రేపు ఈనాటి ఫలితం. ఇది వరకు కారణంగా ఉన్నది ఫలితం అవుతుంది. ఫలితంగా ఉన్నది కారణం అవుతుంది ఇది గొలుసులా జరిగే ప్రక్రియ కాదా? ఒకటి ఇంకో దానిలోకి ప్రవహిస్తుంది. ఎక్కడా ఆగదు. అదొక నిత్యచలనం - స్థిరపడటం అనేది లేకుండా, కారణం - ఫలితం - కారణం అనే చలనానికి అనేక అంశాలు చేస్తాయి.

వివరణలూ, నిర్ణయాలూ స్థిరమైనవి - అవి దక్షిణ పక్షానివైనా, వామ పక్షానివైనా, మతం అనబడే వ్యవస్థగా మారిన నమ్మకమైనా. సజీవంగా ఉన్నదాన్ని కారణాలతో మీరు కప్పిపెట్టటానికి ప్రయత్నిస్తే సజీవమైనది మరణిస్తుంది. మనం చాలా మటుకు కోరేది అదే. మాటలతో, ఊహలతో, ఆలోచనతో మనల్ని నిద్రపుచ్చుకోవాలనుకుంటాం. సహేతుకంగా సమర్థించటం, ఇబ్బందిగా ఉన్న స్థితిని శాంతపరిచేందుకు మరోమార్గం మాత్రమే. నిద్రవచ్చేట్టు చెయ్యాలనీ, కారణాన్ని వెతకాలనీ, నిర్ణయాల కోసం ప్రయత్నించాలనీ కోరటం వల్ల మళ్లీ ఇబ్బంది కలుగుతుంది. దాంతో ఆలోచన తాను అల్లుకున్న వలలోతానే చిక్కుకుంటుంది. తన్ను తాను స్వేచ్ఛగా చేసుకోలేదు. ఆలోచన అనుభవ ఫలితం. అనుభవం ఎప్పుడూ ప్రభావం కలిగించేదే. అనుభవం సత్యానికి కొలమానం కాదు. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవటమే సత్యంలో ఉండే స్వేచ్ఛ.

70. మందకొడితనం

రైలు బయలుదేరేటప్పటికి ఇంకా వెలుగుంది. నీడలు మాత్రం పొడుగవుతున్నాయి. ఊరూ రైలు మార్గాన్ని చుట్టుకుని ఉంది. రైలు వెడుతూంటే చూడటానికి జనం బయటికొచ్చారు. ప్రయాణికులు వాళ్ల