పుట:Mana-Jeevithalu.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
221
ప్రయోజనం లేని చర్య

నాయకులను అనుసరించాడు. ఇప్పుడు ఆయన కూడా తనుచేసే పనిలో ముఖ్యమైన వ్యక్తే. గొప్ప ప్రణాళికలను వెంటనే అమలు చెయ్యాలని ఆయనకీ ఉంది. తక్కిన విద్యావంతుల్లాగే ఆయన కూడా వేదాంతం గురించి చదివాడు. ఆయనది ఆచరించాలనే తత్త్వమట - ఆలోచించటం కాదుట. సంస్కృతంలో ఒక వాక్యం చెప్పాడు మొత్తం ఆచరణ తత్త్వాన్ని గురించి తెలియజేయటానికి. తను ఆచరణలొ పెట్టాలనుకునే రకం మనిషిని అని ఉద్ఘాటించటంలో, జీవితానికి అవసరమైన ముఖ్యమైన వాటిల్లో తానొకడినని - వ్యక్తిగతంగా కాకపోయినా, ఆ రకం వాడినని చెప్పినట్లు అర్థం స్ఫురించింది. తన్నుతాను ప్రత్యేకించుకోవటంతో తన్నుతాను అవగాహన చేసుకోకుండా ఆటంకం ఏర్పరచుకున్నాడు.

ఏదో ఒక వర్గానికి చెందినట్లు చీటీ తగిలించుకుంటే తృప్తిగా ఉన్నట్లుంటుంది. మనం చెందుతామనుకున్న వర్గాన్ని స్వీకరించినట్లయితే జీవితానికొక సంతృప్తికరమైన తాత్పర్యం చెప్పినట్లవుతుంది. మనం మాటల్నీ పేరున్న చీటీని ఆరాధిస్తాం. ఆ సంకేతం యొక్క విలువని అర్థం చేసుకోవటానికి సంకేతానికి అతీతంగా ఎప్పుడూ వెళ్లం. మనం ఇదనీ, అదనీ చెప్పుకుంటూ ఇంకే ఇబ్బందీ కలుగకుండా స్థిరపడిపోతాం. ఈ సిద్ధాంతాలూ, మతాలూ ఇచ్చే శాపం ఏమిటంటే సౌఖ్యం, అవి అందించే భయంకరమైన తృప్తీ. మనల్ని అవి నిద్రపుచ్చుతాయి. ఆ నిద్రలో కలగంటాం. ఆ కలయే ఆచరణ అవుతుంది. ఎంత సులభంగా మన దృష్టి మరోవైపుకి మరలి పోతుంది! మనలో చాలామంది కోరేది ఇతర ఆకర్షణల్లో పడాలనే. నిరంతర సంఘర్షణతో అలిసిపోయిన మనకి ఇతర ఆకర్షణలు అవసరమవుతాయి. ఉన్న స్థితి కన్న అవే ముఖ్యమైపోతాయి. ఇతర ఆకర్షణలతో ఆటలాడవచ్చు. ఉన్నస్థితితో కాదు. ఇతర ఆకర్షణలు, భ్రమలు, వాటివల్ల కలిగే ఆనందం వికటమైనది.

"ఆచరణ అంటే ఏమిటి? ఆచరణ క్రమం అంటే ఏమిటి? మనం ఎందుకు ఆచరిస్తాం? కేవలం కార్యకలాపం, కార్యనిర్వహణా కాదు నిశ్చయంగా. ఏదో వ్యాపకంతో ఉండటం ఆచరణ కాదు, అవునా? గృహిణి తీరిక లేకుండా ఉంటుంది. అది ఆచరణేనా?"

"కాదు, నిశ్చయంగా కాదు. ఆమె దైనందిన కార్యక్రమం గురించే