పుట:Mana-Jeevithalu.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
219
కోరిక, సంఘర్షణ

పెట్టదనుకుంటున్నారా?

"సుఖం ఇబ్బంది పెట్టదు"

అది నిజమేనా? మీరెప్పుడూ సుఖంలోని బాధని అనుభవించలేదా? సుఖం కావాలనే తపన అంతకంతకు హెచ్చి ఇంకా ఇంకా కావాలని కోరదా? ఇంకా కావలనే తపన కూడా, తప్పించుకోవాలని తొందర పడినట్లుగానే ఇబ్బంది కలిగించేది కాదా? రెండూ సంఘర్షణకి కారణమవుతాయి. మనం సుఖప్రదమైన కోరికని అట్టే పెట్టుకుని బాధాకరమైనదాన్ని తప్పించుకుంటాం. కాని, దగ్గర నుంచి పరీక్షగా చూసినట్లయితే, రెండూ ఇబ్బంది కలిగించేవే. కాని మీరు ఇబ్బంది నుంచి విముక్తి పొందాలనుకుంటారా?

"మనకి కోరికే లేకపోతే చచ్చిపోతం; సంఘర్షణే లేకపోతే నిద్రపోతాం."

మీరు అనుభవంతో మాట్లాడుతున్నారా, లేక కేవలం దాని గురించి ఊహించా? సంఘర్షణ అనేది లేకపోతే ఎలా ఉంటుంది అని మనం ఊహిస్తున్నాం. అందుకని సంఘర్షణ ఆగిపోయాక ఉండే స్థితిని అనుభవించ కుండా అడ్డుకుంటున్నాం. మన సమస్యకీ, సంఘర్షణకీ ఏది కారణం అని కదా? ఏదైనా అందమైన దానివల్లకాని, అనాకారివల్లగాని సంఘర్షణ కలగకుండా చూడలేమా? ఆత్మ చైతన్యం లేకుండా మనం గమనించలేమా, వినలేమా? ఇబ్బంది కలగకుండా జీవించలేమా? కోరిక లేకుండా జీవించలేమా? నిస్సంశయంగా, మనం ఇబ్బందిని అర్థం చేసుకోవాలి - దాన్ని తప్పించుకునేందుకుగాని, ఆకాశానికెత్తడానికి గాని ప్రయత్నించకుండా. సంఘర్షణని అర్థం చేసుకోవాలి, దాన్ని మహోన్నతం చేయటంగాని, అణచిపెట్టటంగాని కూడదు.

సంఘర్షణకి కారకమయేదేమిటి? సమస్యకి ప్రతిక్రియ తగినట్లు లేకపోతే సంఘర్షణ జనిస్తుంది. ఈ సంఘర్షణే ఆత్మ అనే చైతన్యం కేంద్రీకృతం కావటం. సంఘర్షణ ద్వారా ఆత్మ అనే చైతన్యం కేంద్రీకృతం కావటమే అనుభవం. సమస్యకిగాని, ప్రేరేపణకిగాని ఏర్పడే ప్రతిక్రియే అనుభవం. మాటల్లోపెట్టని, పేరు పెట్టని అనుభవం ఉండదు. పేరు పెట్టటం, జ్ఞాపకం అనే సామానుగది లోంచి - ఈ పేరు పెట్టటం అంటే - మాటల్లో రూపొందించే పద్ధతి. సంకేతాలు చెయ్యటం, ఊహా చిత్రాలు, మాటలు - వీటితో జ్ఞాపకాన్ని