పుట:Mana-Jeevithalu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మనం కోరుతున్నామని ఎప్పుడు అంటాం? కోరిక నిర్గుణంగా ఉండదు. దేనితోనైనా సంబంధం ఉన్నప్పుడే అది ఉంటుంది. సంపర్కంలో సంబంధంలో కోరిక పుడుతుంది. సంపర్కం లేకుండా కోరిక ఉండదు. సంపర్కం ఏ స్థాయిలోనైనా కావచ్చు. కాని, అది లేకుండా అనుభూతీ, ప్రతిక్రియా, కోరికా ఉండవు. కోరిక విధానం మనకి తెలుసు, అది ఎలా పుడుతుందోః గ్రహించటం, సంపర్కం, అనుభూతి, కోరిక. కాని, మనం కోరిక ఉందని ఎలా తెలుసుకుంటాం? నాకు కోరిక ఉంది అని నేనెప్పుడు అంటాను? సుఖంగాని, దుఃఖంగాని ఇబ్బంది కలిగించినప్పుడే. సంఘర్షణ గాని ఇబ్బందిగాని ఉన్నదని తెలుసుకున్నప్పుడే కోరికని గుర్తించటం జరుగుతుంది. సమస్యకి తగిన ప్రతిక్రియ లేకపోవటమే కోరిక. అందమైన కారుని చూడటంతోనే సుఖానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇబ్బందే కోరికని తెలుసుకోవటం. ఇబ్బంది బాధ వల్ల కలిగినా, సుఖం వల్ల కలిగినా, దానిమీదే దృష్టి నిలపటం ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యమే కోరిక. సమస్యకి తగిన ప్రతిక్రియ లేకపోవటం వల్ల ఇబ్బంది కలిగినప్పుడు మనం చైతన్యంగా ఉంటాం. సంఘర్షణ అంటే ఆత్మ చైతన్యం. ఈ ఇబ్బంది నుంచీ, కోరిక యొక్క సంఘర్షణ నుంచీ విముక్తి సాధ్యమా?

"మీరనేది కోరిక యొక్క సంఘర్షణ నుంచి విముక్తి పొందటమా, లేక కోరిక నుంచేనా?"

సంఘర్షణ, కోరిక - రెండు వేరు వేరు స్థితులా? అయినట్లయితే, మన విచారణ భ్రమకి దారితీయక తప్పదు. సుఖంనుంచి గాని, బాధనుంచి గాని, కావాలనుకోవటంనుంచి గాని, ప్రయత్నించటంనుంచి గాని, నెరవేరటం నుంచి గాని, వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని ఇబ్బంది లేనట్లయితే కోరిక ఉంటుందా? ఇబ్బంది తొలగించుకోవాలనుకుంటాం, కాదా? దీన్ని అర్థం చేసుకున్నట్లయితే కోరిక అర్ధాన్ని గ్రహించటానికి వీలవవచ్చు. సంఘర్షణ అంటే ఆత్మ చైతన్యం. ఇబ్బంది ద్వారా ధ్యానాన్ని కేంద్రీకరించటం కోరిక. ఇంతకీ మీరు కోరికలోని సంఘర్షణాంశాన్ని వదిలించుకుని సుఖప్రదమైన అంశాన్ని అట్టిపెట్టుకోవాలని అనుకుంటున్నారా? సుఖమూ, సంఘర్షణా, రెండూ ఇబ్బంది కలిగించేవే, కాదా? లేకపోతే, సుఖం ఇబ్బంది