పుట:Mana-Jeevithalu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలోచన ఆగిపోవటం

215

మనస్సు తన చుట్టూ మూసేసుకుంటుంది. దాన్ని సమీపించటానికి కుదరదు. అభేద్యంగా ఉంటుంది. అందులోనే దానికి రక్షణ లభిస్తుంది. ఆలోచన స్వతస్సిద్ధంగా తన్నుతాను ప్రత్యేకించుకునేది. దాన్ని భేదించటం సాధ్యం కాదు. ఆలోచన అనాలోచితంగా ఉండజాలదు, అది ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. కొనసాగుతున్న గతమే ఆలోచన. కొనసాగుతున్నది స్వచ్ఛగా ఉండలేదు. అంతమైనప్పుడే స్వేచ్ఛ ఉంటుంది.

వ్యాపకంతో ఉండే మనస్సు తను పనిచేస్తున్న దాన్ని తానే సృష్టించుకుంటుంది. ఎద్దుబండినిగాని, జెట్ విమానాన్ని గాని తయారు చేయగలదు. మనం తెలివి తక్కువ వాళ్లం అని అనుకోగలం. మనం తెలివి తక్కువ వాళ్లమే. మనమే దైవం అనుకోగలం. మనం ఊహించినదే మనం. "నేనే అది."

"ప్రాపంచిక విషయాల్లో కన్న దేవుని గురించిన వాటితో వ్యాపకం పెట్టుకోవటం నిశ్చయంగా మంచిది, కాదా?"

మనం ఏది ఆలోచిస్తామో అదే మనం. ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకోవటం ముఖ్యం, అంతేకాని, మనందేన్ని గురించి ఆలోచిస్తున్నామో అది కాదు. భగవంతుడి గురించి ఆలోచిస్తున్నామా లేదా ఒక పానీయం గురించి ఆలోచిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు; ప్రతిదానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. కాని, రెండింటిలోనూ స్వయం కల్పితమైన దాని గురించే ఆలోచనకి వ్యాపకం. ఊహలూ, ఆదర్శాలూ, లక్ష్యాలూ, మొదలైనవన్నీ ఆలోచన కల్పించినవే - విస్తరించిన ఆలోచనలే. ఏ స్థాయిలోనైనా సరే. స్వయం కల్పితమైన వాటి గురించి వ్యాపకం పెట్టుకోవటం 'నేను'ని ఆరాధించటమే. 'నేను' అనేది కూడా ఆలోచన రూపకల్పనే. ఆలోచన దేనితో వ్యాపకం పెట్టుకుంటే అదే అది. అది ఆలోచన తప్ప మరొకటి కానే కాదు. అందుచేత ఆలోచనా ప్రక్రియని అవగాహన చేసుకోవటం ముఖ్యం.

ఆలోచన సమస్యకి ప్రతిక్రియ, కాదా? సమస్య లేకుంటే ఆలోచన ఉండదు. సమస్య, ప్రతిక్రియ - వీటి ప్రక్రియే అనుభవం. అనుభవాన్ని మాటలలో రూపొందించటమే ఆలోచన. అనుభవం ఎప్పుడూ గతించినదే, కాని ప్రస్తుతంతో కలిసిన గతం. అది వ్యక్తంగానూ ఉంటుంది, నిగూఢంగానూ ఉంటుంది. ఈ అనుభవ శేషమే జ్ఞాపకం, ప్రభావం జ్ఞాపకం యొక్క, గతం