పుట:Mana-Jeevithalu.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
210
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"అ జ్వాల కలిగి ఉండటం సాధ్యమేనా, లేక, అది కొద్ది మంది కోసమేనా?"

అది కొద్దిమంది కోసమో, అనేక మంది కోసమో అనేది అసలు విషయం కాదు కదా? అ మార్గానపోతే, అది మన అజ్ఞానానికీ భ్రమకీ దారితీస్తుంది. మనం ఆలోచించవలసినది జ్వాల గురించి. మీలో ఆ జ్వాల, అ పొగలేని జ్వాల ఉండగలదా? తెలుసుకోండి. పొగని నిశ్శబ్దంగా, ఓపిగ్గా గమనించండి. ఆ పొగని పోగొట్టలేరు. మీరే ఆ పొగ కనుక. పొగ పోగానే జ్వాల వస్తుంది. ఈ జ్వాల తరిగి పోనిది. ప్రతిదానికీ ఒక ఆది, ఒక అంతం ఉంటుంది. అది త్వరలోనే అలిసిపోతుంది, పాతబడిపోతుంది. మనస్సుకి సంబంధించినవి లేకుండా హృదయం శూన్యంగా ఉన్నప్పుడు, మనస్సు ఆలోచన లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రేమ ఉంటుంది. శూన్యంగా ఉన్నది తరిగిపోదు.

ఉన్న పోరాటం జ్వాలకీ పొగకీ మధ్య కాదు. పొగలోనే వివిధ ప్రతిక్రియల మధ్య. జ్వాలకి, పొగకీ మధ్య సంఘర్షణ ఎన్నటికీ ఉండదు. సంఘర్షణ రావటానికి సంబంధం ఉండాలి. వాటి మధ్య సంబంధం ఎలా ఉండగలదు? ఒకటి ఉంటే రెండోది ఉండదు.

65. మనస్సుకి వ్యాపకం

ఆ వీధి ఇరుకుగా ఉంటుంది జనంతో కిక్కిరిసినట్లుగా. కాని, బళ్ల రాకపోకలు తక్కువే. ఏ బస్సైనా, కారైనా వెడుతున్నప్పుడు బాగా పక్కకి తప్పుకోవాలి - దాదాపు కుళ్లు కాలవలో దాకా. కొన్ని చిన్నచిన్న దుకాణాలేవో ఉన్నాయి. ద్వారాల్లేని గుడి ఒకటుంది. గుడి అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. ఆ ఊరి వాళ్లే అక్కడ ఉన్నారు, చాలామంది కాకపోయినా, ఒక దుకాణం పక్కని ఒక కుర్రవాడు కూర్చుని పూలమాలలూ, పూలగుత్తులూ కడుతున్నాడు. వయస్సు పన్నెండో, పధ్నాలుగో ఉంటుంది. పక్కనే ఉన్న చిన్న నీళ్ల జాడీలో దారం ఉంది. అతని కెదురుగా తడిగుడ్డ మీద పువ్వులు చిన్నకుప్పలుగా పోసి ఉన్నాయి - మల్లెలు, కొంచెం గులాబీలు, బంతి