పుట:Mana-Jeevithalu.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
205
ఆత్మ త్యాగం

"ఈ ప్రతిఫలం పరిస్థితులతో బాటు వచ్చింది. అంతేకాని, నేను కావాలని తెలిసి ప్రతిఫలాన్ని కోరలేదు, నేను మొదట ఉద్యమంలో చేరినప్పుడు."

ప్రజాప్రియమైనది గాని, అప్రియమైనది గాని, ఒక ఉద్యమంలో చేరటం వల్లనే దాని ప్రతిఫలం దానికుంటుంది, కాదా? తెలిసి చేరకపోవచ్చు. కాని చేరమని బలవంతం చేయించే అంతరంగిక ప్రేరేపణలు కలగా పులగంగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోకుండా ప్రతిఫలాన్ని కోరలేదని చెప్పటానికి వీల్లేదు. అసలు పరిత్యజించాలనీ, త్యాగం చెయ్యాలనీ పడే ఈ తపనని అర్థం చేసుకోవటం ముఖ్యమనేది నిస్సంశయం, కాదా? మనం ఎందుకు వదులుకోవాలనుకుంటాం? దానికి సమాధానం ఇవ్వటానికి ముందు, మనం ఎందుకు బంధనాలను పెంచుకుంటాం? మనకు మమకార బంధనాలు ఉన్నప్పుడే బంధనాలను వదిలించుకోవాలని అంటాం. అసలు బంధమే లేకపోతే వదిలించుకోవటానికి పోరాటమే ఉండదు. సొంతం చేసుకుని ఉండనట్లయితే, పరిత్యాగమే ఉండదు. ముందు సొంతం చేసుకుంటాం, తరవాత పరిత్యజిస్తాం - ఇంకేదో సొంతం చేసుకోవటానికి. ఈవిధంగా క్రమక్రమంగా అధికంగా పరిత్యజించటం మహనీయంగా, ఆధ్యాత్మిక ఔన్నత్యంగా పరిగణింప బడుతుంది.

"అవును, అది నిజమే. సొంతమనుకున్నదే లేకపోతే, పరిత్యజించ వలసిన అగత్యమే ఉండదు."

అందువల్ల పరిత్యజించటం, ఆత్మత్యాగం గొప్పతనానికి లక్షణం కాదు - దాన్ని కీర్తించటానికి గాని, అనుకరించటానికి గాని, మనం ఎందుకు సొంతం చేసుకుంటామంటే సొంతమనేది లేకపోతే మనం ఉండం. సొంతం చేసుకునేవి అనేకం, రకరకాలుగా. ప్రాపంచికమైనవి సొంతంగా లేని వారు జ్ఞానానికీ, ఊహలకీ మమకార బంధితులై ఉండొచ్చు. మరికొందరు సద్గుణానికీ, మరొకరు అనుభవానికీ, ఇంకొకరు పేరు ప్రతిష్ఠలకీ, ఆ రకంగా బంధితులు కావచ్చు. సొంతమైనవి లేకుండా "నేను" అనేది ఉండదు. "నా" అంటేనే సొంత ఆస్తి, సామాను, సద్గుణం, పేరు; ఏదున్నా ఏమీ కాకుండా ఉంటాననే భయంతో మనస్సు పేరుకీ, సామానుకీ, విలువకీ మమకార బంధం