పుట:Mana-Jeevithalu.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
202
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పొందటం అంటే దేన్నైనా ఎదుర్కోవటం, దానికి ప్రతిక్రియ కలగటం. ఈ అనుభవించటం, దానితో బాటు దానికొక పేరు పెట్టటం, దాన్ని పదిలపరచటం - ఈ మొత్తం ప్రక్రియ వివిధ స్థాయిల్లో జరగటమే చైతన్యంగా ఉండటం, కాదా? అనుభవం ఒక ఫలితం, అనుభవం పొందటం యొక్క ఫలితం. ఆ ఫలితానికొక మాట నిర్ణయించబడుతుంది. ఆ మాటే నిర్ణయం. అటువంటి నిర్ణయాలెన్నో కలిసి జ్ఞాపకంగా అవుతుంది. ఈ నిర్ణయించే ప్రక్రియే చైతన్యంగా ఉండటం. నిర్ణయం, ఫలితం స్వీయ చైతన్యం. 'నేను' అనేది జ్ఞాపకం, ఎన్నో నిర్ణయాలూ. ఆలోచన జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ. ఆలోచన ఎప్పుడూ నిర్ణయమే. ఆలోచించటం అంటే నిర్ణయానికి రావటం. అందువల్ల అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు.

ఆలోచన ఎప్పుడూ పైపైదే, నిర్ణయమే. చైతన్యంగా ఉండటం అంటే పైపైదాన్ని పదిలపరచటం. పైపైన ఉన్నది తన్నుతాను విభజించుకుంటుంది. పైది అనీ, లోపలిది అనీ, కాని, ఈ విభజన ఆలోచనను పైపైది కాకుండా ఉండేట్లుగా ఎంత మాత్రం చేయలేదు.

"కాని ఆలోచన కతీతమైనదీ, కాలానికి అతీతమైనదీ. మనస్సు సృష్టించవిదీ వేరే ఏమీలేదా?"

అట్టి స్థితి గురించి మీకెవరైనా చెబితే విని ఉంటారు. లేదా దాని గురించి చదివి ఉంటారు. లేదా దాన్ని అనుభవించటం జరిగి ఉంటుంది. దాన్ని అనుభవం పొందటం అనుభవం కాదు, ఫలితం కాదు. దాన్ని గురించి ఆలోచించటం సాధ్యం కాదు. సాధ్యమయితే అది జ్ఞాపకమే గాని అనుభవించటం కాదు. మీరు చదివిన దాన్ని గాని, విన్నదాన్నిగాని పునశ్చరణ చేయ వచ్చు. కాని మాట అసలైనది కాదు. మాట, పునశ్చరణ - అనుభవించ కుండా అడ్డుకుంటుంది. ఆలోచన ఉన్నంతవరకూ అనుభవించేస్థితి ఉండటం సాధ్యం కాదు. ఫలితం, పరిణామం ఎన్నటికీ అనుభవించే స్థితిని తెలుసుకోలేవు.

"అయితే, ఆలోచన ఎలా అంతమవుతుంది?"

ఆలోచన తెలిసిన దాని ఫలితం కాబట్టి అనుభవించే స్థితిలో ఎన్నటికీ ఉండలేదన్న సత్యాన్ని గ్రహించండి. అనుభవించటం ఎప్పుడూ కొత్తదాన్నే