పుట:Mana-Jeevithalu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలోచన, చైతన్యం

199

కొత్తదానికి బాటవేసుకున్నారు. పాత దాంట్లో కొత్తది ఇముడుతుందా?

మనస్సు ఎన్నటికీ కొత్తదాన్ని సృష్టించలేదు. మనస్సే ఒక ఫలితం. అన్ని ఫలితాలూ పాతవాటి నుంచి వచ్చినవే. ఫలితాలు ఎన్నటికీ కొత్తవి కాలేవు. ఫలితం కోసం ప్రయత్నించటం అనాలోచితంగా ఎన్నటికీ జరగదు. స్వేచ్ఛగా ఉన్నది ఒక లక్ష్యం కోసం ప్రయత్నించలేదు. లక్ష్యం, ఆదర్శం ఎప్పటికీ మనస్సు రూపొందించినదే. నిజానికి, అది ధ్యానం కాదు. ధ్యానం అనేది ధ్యానం చేసేవానికి స్వేచ్ఛ కలిగించటమే. స్వేచ్ఛగా ఉన్నప్పుడే సాక్షాత్కరింపజేసుకోవటం, గ్రహించే సున్నితత్వం ఉంటుంది. స్వేచ్ఛ లేనిదే ఆనందం లేదు. కాని, స్వేచ్ఛ క్రమశిక్షణ ద్వారా రాదు. క్రమశిక్షణ స్వేచ్ఛాపథకాన్ని తయారు చేస్తుంది. కాని, పథకం స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ ఉండాలంటే పథకాన్ని ముక్కలు చెయ్యాలి. పథకపు అచ్చుని ముక్కలు ముక్కలుగా చేయటమే ధ్యానం. కాని ఈ అచ్చుని ముక్కలు చేయటం ఒక లక్ష్యం, ఒక ఆదర్శం కాదు. ఈ అచ్చుని క్షణక్షణమూ ముక్కలు చేస్తూనే ఉండాలి. ముక్కలైన క్షణం మరచిపోయిన క్షణం. జ్ఞాపకమున్న క్షణమే అచ్చుని రూపొందిస్తుంది. అప్పుడే అచ్చుని తయారుచేసేదీ, ఉద్భవిస్తుంది - అన్ని సమస్యలకూ, సంఘర్షణలకూ దుఃఖాలకూ మూలకారకమవుతుంది.

ధ్యానం అంటే మనస్సుని దాని ఆలోచనల నుంచి, అన్నిస్థాయిల్లోని ఆలోచనల నుంచీ విముక్తి చేయటమే. ఆలోచించేది వేరూ, ఆలోచన వేరూకాదు. అవి ఒకే ప్రక్రియ. రెండూ వేరువేరు ప్రక్రియలు కాదు. వేరువేరు ప్రక్రియలు అజ్ఞానానికీ భ్రమకీ మాత్రమే దారితీస్తాయి. ధ్యానం చేసేది ధ్యానం. అప్పుడు మనస్సు ఏకాంతంగా ఉంటుంది. నిశ్శబ్దంగా చేయబడి ఉండటం కాదు. ఏకాంతంగా ఉన్నదాని వద్దకే కారణరహితమైనది వస్తుంది. ఏకాంతంగా ఉన్నదానికే ఆనందం ఉంటుంది.

62. ఆలోచన, చైతన్యం

అన్నీ వేటికవి ముడుచుకుపోతున్నాయి. వృక్షాలు తమ్ముతాము ఆవరించుకుంటున్నాయి. పక్షులు ఆనాటి తిరుగుళ్లను గుర్తుతెచ్చుకోవటానికి