పుట:Mana-Jeevithalu.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
198
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

దానిలా. కాని, గాఢంగా చూస్తే, అందులో దోషం ఏముంది? ఆ ఆనందాన్ని కోరటంలో ప్రధానంగా దోషం ఏముంది? నేను చేసిన ప్రయత్నాలన్నింటికీ ఫలితం కోరుతున్నాననుకోండి. అయితే, అలా ఎందుకు అనుకోకూడదు?"

ఆనందాన్ని ఆవిధంగా కోరటంలో ఆ ఆనందమే ఆఖరిదైనట్లు, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందన్నట్లూ సూచిస్తుంది. తక్కిన ఫలితాలన్నీ అసంతృప్తికరమైనవే. ప్ర్రాపంచిక లక్ష్యాలను సాధించటానికి తీవ్రంగా ప్రయత్నించారు. వాటి క్షణికత్వాన్ని కూడా చూశారు. ఇప్పుడు ఒక అనంతమైన స్థితిని కోరుకుంటున్నారు. అంతంలేని గమ్యాన్ని కోరుతున్నారు. మనస్సు ఆఖరి అవినాశకరమైన ఆశ్రయాన్ని కోరుతోంది. అందుకోసం తన్నుతాను క్రమశిక్షణలో పెట్టుకుంటుంది. శిక్షణ నిచ్చుకుంటుంది. తను కోరినదాన్నీ పొందటానికి కొన్ని సద్గుణాలను సాధన చేస్తుంది. అది ఒకసారి ఆ ఆనందాన్ని అనుభవించి ఉండవచ్చు. ఇప్పుడు దానికోసం ఒగురుస్తూ వెంటబడుతోంది. వేరే ఫలితాలకోసం ప్రయత్నించే ఇతరులలాగే మీరూ దానికోసం ప్రయత్నిస్తున్నారు. మీరు దాన్ని మరొక స్థాయిలో ఉంచారు. దాన్ని మీరు ఉన్నతం అనొచ్చు. కాని అది అప్రస్తుతం. ఫలితం అంటే అంతమవటం. చేరుకోవటంలో ఇంకేదో అవటానికి ప్రయత్నం ఉంటుంది. మనస్సు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. ఎప్పుడూ దేనికోసమో కష్టపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ లాభం పొందుతూనే ఉంటుంది, ఓడిపోతానని నిత్యం భయపడుతూనే ననుకోండి. ఈ ప్రక్రియనే ధ్యానం అంటున్నారు. అనంతంగా ఏదో అవుతూ ఉండటంలో చిక్కుకున్న మనస్సు ఆనందాన్ని తెలుసుకుంటుందా? మనస్సు తనపై తాను విధించుకున్న క్రమశిక్షణ నుంచి ఎప్పటికైనా స్వేచ్ఛను పొందగలదా అ ఆనందాన్ని గ్రహించటానికి? ప్రయత్నం, పోరాటం ద్వారా, ప్రతిఘటన, పరిత్యాగాల ద్వారా మనస్సు తనలో సున్నితత్వం లేకుండా చేసుకుంటుంది. అటువంటి మనస్సు తెరుచుకుని తట్టుకోగలుగుతుందా? ఆ ఆనందాన్ని కోరటం ద్వారా ఊహాతీతమైనదీ, అపరిచితమైనదీ - ఏదీ లోనికి చొచ్చుకోకుండా మీ చుట్టూ మీరు గోడకట్టుకోలేదా? కొత్తదేదీ ప్రవేశించకుండా మిమ్మల్ని మీరు అన్నివిధాలా బంధించుకోలేదా? పాతదానిలో నుంచే