పుట:Mana-Jeevithalu.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
197
ఆనందాన్ని కోరటం

గడిపాడుట. కాని, అది చాలా స్వల్పవిషయం అన్నాడు. ప్రాపంచిక విషయాల పట్ల కూడా ఆయన ఆకర్షితుడు కాలేదుట. ఒకప్పుడు ప్రాపంచికమైన వాటితో ఆటలాడాడుట. కాని, ఆ ఆట కొన్నేళ్ల క్రిందటే ముగిసిపోయిందిట. ఏదో ఉద్యోగం లాంటిది ఉందిట. అది కూడా యథాలాపంగానేనట.

ధ్యానం యొక్క ఫలితం ధ్యానమే. ధ్యానం ద్వారా గాని, దానికింకా పైనగాని ఏదైనా ప్రయత్నించటం లక్ష్య సాధన అవుతుంది. సాధించినది మళ్లీ పోతుంది. ఫలితాన్ని ఆశించటం స్వయంకల్పనని కొనసాగించుకోవటమే. ఫలితం ఎంత ఉన్నతమైనదైనా, అది వాంఛారూపమే, ధ్యానం దేన్నో చేరటానికో, సాధించటానికో, సాక్షాత్కరింప చేసుకోవటానికో అయితే. అది ధ్యానం చేసేవానికి శక్తినిస్తుందంతే. ధ్యానం చేసేవాడే ధ్యానం. ధ్యానం చేసే వానిని అవగాహన చేసుకోవటమే ధ్యానం.

"నేను అంతిమ సత్యాన్ని కనుక్కోవటానికి, లేదా, ఆ సత్యం సాక్షాత్కారం కావటానికి ధ్యానం చేస్తున్నాను. నేను ఆశిస్తున్నది ఒక ఫలితం కాదు. సరిగ్గా చెప్పాలంటే - అదొక ఆనందం - అప్పుడప్పుడు అనుభూతి పొందేది. అది ఉంది. దాహం వేస్తున్నవాడు నీటికోసం తప్పించిపోయినట్లు ఆ అవ్యక్తమైన ఆనందాన్ని కోరుతున్నాను. అన్నిరకాల సంతోషం కన్న ఎన్నో రెట్లు గొప్పది ఆ ఆనందం. నా కత్యంత ప్రియమైన కోరిక తీర్చుకోవటం కోసమే ప్రయత్నిస్తున్నాను."

అంటే, మీరు కోరుతున్నదాన్ని పొందటానికి మీరు ధ్యానం చేస్తున్నారు. మీరు కోరిన దాన్ని పొందటానికి మిమ్మల్ని మీరు తీవ్రమైన క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కొన్ని నియమాలూ, నిష్ఠలూ పాటిస్తారు. ఒక మార్గాన్ని తయారుచేసి, దాన్ని అనుసరిస్తారు, గమ్యాన్ని చేరుకోవటానికి, కొన్ని ఫలితాలనూ, కొన్ని నిర్ణీత అవస్థలనూ పొందగలరని ఆశిస్తారు. మీ కృషిలో చూపించే పట్టుదలను బట్టి క్రమక్రమంగా అధికమైన ఆనందాన్నీ, అంతకన్న అధికమైన ఆనందాన్నీ పొందుతారు. బాగా వేసుకున్న ఈ మార్గం మీకు అంతిమ ఫలితం లభిస్తుందని హామీ ఇస్తుంది. అందువల్ల మీ ధ్యానం చాలా ఆలోచించుకుని నడుపుతున్న వ్యవహారం కాదా?

"మీరలా అంటూంటే అవుననిపిస్తోంది పైకి - చాలా అర్ధహీనమైన