పుట:Mana-Jeevithalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆటలాడుకుంటున్నారా? ఒకసారి తెరిస్తే కొంచెమైనా సరే. దాన్ని మళ్లీ మూయటం సాధ్యం కాదు. అ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. పగలూ, రాత్రీ, దానిలో ఉన్నవి పైకి ఒలికిపోతూ ఉంటాయి. పారిపోవటానికి ప్రయత్నించవచ్చు. ఎప్పుడూ చేసేదే ఆ పని. కాని, అది అలాగే ఉంటుంది. నిరీక్షిస్తూ, గమనిస్తూ. నిజంగా తెరవాలని అనుకుంటారా ఎవరైనా?

"నిజంగానే నేను చేస్తాను. అందుకే వచ్చాను నేను. నేను దాన్ని ఎదుర్కోవాలి. అన్నీ ఆఖరైపోయే చోటికి చేరుతున్నాను - అందుకని. నేనేం చెయ్యాలి?"

తెరిచి చూడండి. ధనం కూడబెట్టటానికి గాయపరచాలి, క్రూరంగా, ఔదార్యం లేకుండా ఉండాలి - నిర్దాక్షిణ్యత, గడుసుగా లెక్కలు వేసుకోవటం, నిజాయితీ లేకపోవటం ఉండాలి. బాధ్యత, కర్తవ్యం, సామర్థ్యం, హక్కులు వంటి - ఎంతో మధురంగా ధ్వనించే మాటలతో కప్పిపుచ్చి చేసే అహంకారపూరిత చర్య అధికారం కోసం ప్రయత్నించడం కూడా ఉండాలి.

"అవును, అదంతా నిజమే. ఇంకేదన్నా నిజమే. ఎవ్వరి గురించీ ఆలోచించటం ఉండదు. మత సంబంధమైన వ్యాపకాలు మనకు గౌరవ ప్రతిష్టలనిచ్చే తొడుగులు మాత్రమే. ఇప్పుడు చూస్తే ప్రతిదీ నా చుట్టూ తిరిగినట్లుగా అనిపిస్తోంది. నేను కేంద్రాన్ని - కాదని నటించినా, అదంతా చూస్తున్నాను. కాని నేనేం చెయ్యాలి?"

మొట్టమొదట ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడాలి. కాని, ఆ తరవాత వీటన్నిటినీ తుడిచి పారవెయ్యటం ఎలా కుదురుతుంది? అప్యాయత, ప్రేమ అనే పొగలేని జ్వాలలేనట్లయితే? ఈ జ్వాల ఒక్కటే ఆ అలమారులోని వాటినన్నిటినీ తుడిచి పారవెయ్యగలదు. ఇంకేదీ కాదు. విశ్లేషణగాని, త్యాగంగాని, పరిత్యాగంగాని చెయ్యలేదు. ఈ జ్వాల ఉన్నట్లయితే, అప్పుడది త్యాగంకాదు, పరిత్యాగం కాదు. అప్పుడు తుఫానుని ఢీకొంటారు, మీరు ఎదురు చూడకుండానే.

"కాని, నేను ప్రేమించటం ఎలా? మనుషులంటే నాకు అప్యాయత లేదని నేనెరుగుదును. నేను నిర్దాక్షిణ్యంగా ఉన్నాను. నాతో ఉండవలసిన