పుట:Mana-Jeevithalu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఎలా ప్రేమించను?

189

ఎవడికి తగినట్లు వాడికి ఫలితం ముట్టాలంటాడు - తనకు తగినట్లు తనకు ముట్టినట్లుగా. ఆ రోజు ఉదయం తన్ను తాను ఇంకా తేటతెల్లం చేసుకోవటానికి వచ్చాడు. ఏదో కష్టం బాధిస్తోంది. చాలా వరకు విజయవంతమైన ఆయన జీవితంలో ఏవో తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. విజయలక్ష్మి ఆయన్ని పూర్తిగా వరించటం లేదు.

"నేను ఎటువంటి వాడినో నాకు తెలిసివస్తోంది" అన్నాడు. "ఇన్నేళ్ల నుంచీ మిమ్మల్ని తెలియకుండా వ్యతిరేకంచి ప్రతిఘటించాను. మీరు ధనవంతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మా గురించి ఎన్నింటినో పరుషంగా మాట్లాడుతారు. మీమీద నాకు కోపం వచ్చేది. కాని తిరిగి మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయేవాణ్ణి. మిమ్మల్ని అందుకోవటం నావల్లకాదు. ఎన్నోవిధాల ప్రయత్నించాను. మిమ్మల్ని తాకలేకపోతున్నాను. ఇంతకీ నన్నేం చేయమంటారు? మీ మాటలు వినకుండా, మీ దరిదాపుల్లోకి ఎక్కడికీ రాకుండా దేవుడు చేసి ఉంటే బాగుండేదనుకుంటూ ఉంటాను. నాకిప్పుడు రాత్రులు నిద్ర ఉండదు. ఇదివరకు ఎంతో చక్కగా నిద్రపోయేవాడిని. భయంకరమైన కలలు వస్తున్నాయి నాకు. ఎప్పుడో గాని కలగనే వాణ్ణికాదు. మీరంటే భయం వేసేది. మిమ్మల్ని మౌనంగా శపించుకున్నాను. కాని, వెనక్కి తిరిగి పోలేను. నేనేం చెయ్యాలి? నాకు స్నేహితులు లేరు. మీరన్నట్లు ఇదివరకులా వాళ్లని కొనుక్కోలేను. జరిగిన దానివల్ల నేను పూర్తిగా బయటపడి పోయాను. నేను మీకైనా స్నేహితుణ్ణి కాగలనేమో. మీరు సహాయం చేస్తానన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. నేనేం చెయ్యాలి?"

బయటపడటం అంత సులభం కాదు. అందులోనూ తన్నుతానే బయటపెట్టుకోవటమా? ఆ అలమారుని ఎప్పుడైనా తెరుస్తారా? దానిలో తాను చూడదలుచుకోనివన్నిటినీ కుక్కి జాగ్రత్తగా తాళం వేసి మూసి ఉంచినదాన్ని తెరుస్తారా? అసలు దాన్ని తెరవాలనీ, అందులో ఏముందో చూడాలనీ అనుకుంటారా?

"నేను చేస్తాను. కాని ఎలా మొదలుపెట్టాలి?"

నిజంగా చెయ్యాలనుకుంటున్నారా, లేక, ఆ ఉద్దేశంతో కేవలం