పుట:Mana-Jeevithalu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నిజానికి, ఆయన మీద కాదు, మీ విచక్షణా జ్ఞానం మీద, మీ చర్యల మీదనే మీకు కోపం. మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడుతున్నారు. ఇది గ్రహించటం ఇష్టంలేక ఆయన ఉన్నస్థితికి ఆయన్ని నిందిస్తున్నారు. మీకు ఆయన మీద ఉన్న కోపం మీ ప్రణయారాధన నుంచి తప్పించుకునే మార్గం మాత్రమే అని మీరు గ్రహించినప్పుడు ఆయన ప్రసక్తే ఉండదు. ఆయన్ని గురించి మీరు సిగ్గుపడటం లేదు. ఆయనతో సంపర్కం పెట్టుకున్నందుకు మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడుతున్నారు. మీ మీదే మీకు కోపం, ఆయన మీద కాదు.

"అవును, అది నిజమే."

ఇది మీరు నిజంగా గ్రహించినట్లయితే, దాన్ని యథార్థంగా అనుభవం పొందినట్లయితే, మీరు ఆయన నుంచి స్వేచ్ఛగా ఉంటారు. ఆయనంటే మీకు శత్రుత్వం ఉండదు. ప్రేమ బంధించినట్లుగానే ద్వేషంకూడా బంధిస్తుంది.

"అయితే, నా సిగ్గు నుంచి, నా తెలివి తక్కువతనం నుంచీ నేను స్వేచ్ఛగా ఉండటం ఎలా? ఆయన ఉన్న విధంగా ఆయన ఉన్నారనీ, ఆయన్ని నిందించకూడదని గ్రహించాను స్పష్టంగానే. కాని నా తలవంపుల నుంచీ, నాలో పెరిగి పెద్దదై బ్రద్ధలయే స్థితికి వచ్చిన నా కోపం నుంచీ స్వేచ్ఛగా ఉండటం ఎలా? గతాన్ని తుడిచి పెట్టెయ్యటం ఎలా?"

గతాన్ని ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారో అది ఎక్కువ ముఖ్యం - ఎలా తుడిచిపెట్టెయ్యాలన్న దాని కన్న సమస్యని ఏ ఉద్దేశంతో సమీపిస్తున్నారో అది ఎక్కువ ముఖ్యం - దాని గురించి ఏంచెయ్యాలనుకుంటున్నారో అనే దాని కన్న. ఆ సంబంధాన్ని గురించి జ్ఞాపకాన్ని ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారు?

"ఆ గడిచిన సంవత్సరాల జ్ఞాపకం నాకిష్టం లేదు. వాటివల్ల నా నోట్లో చేదు మాత్రమే మిగిలింది. అది తగినంత కారణం కాదంటారా?"

అంతగా కాదు, అవునా? ఈ గత జ్ఞాపకాలను ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారు? నిజానికి అవి మీనోట చేదు మిగిల్చాయన్నందుకు కాదు. ఏదో విధంగా అ గతాన్ని తుడిచి పెట్టెయ్యగలిగినా