పుట:Mana-Jeevithalu.pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
181
స్వాభిమానం

కావాలి. ఆ వ్యక్తితో ఏవిధమైన సంబంధమూ ఇష్టం లేదు నాకు."

ఏ విధంగా ఆ వ్యక్తితో సంబంధం ఉంది మీకు? శారీరకంగా ఇప్పటికే స్వేచ్ఛగా ఉన్నట్లయితే? మీకూ ఆయనకీ ఇంకే విధమైన సంబంధమైనా ఉందా?

"నాకు తెలియదు. ఆయనంటే నాకు చాలా ద్వేషం. ఆయనకి సంబంధించిన దాంతో నాకు ఏవిధమైన ప్రమేయమూ ఉండటం ఇష్టంలేదు."

మీకు స్వేచ్ఛ కావాలి. కాని ఆయన మీద మీకు ద్వేషం ఉందా? అయితే ఆయన నుంచి మీరు స్వేచ్ఛగా లేరన్న మాట. ఆయన మీద ఎందుకు ద్వేషం?

"ఆయన ఎటువంటాయనో ఈ మధ్యనే కనుక్కున్నాను - ఆయనకున్న అల్పబుద్ధి, ప్రేమ అనేది నిజంగా లేకపోవటం, ఆయనకున్న స్వార్థం. ఆయన గురించి ఎంత ఘోరమైన విషయం తెలుసుకున్నావో మీకు చెప్పలేను. ఆయన గురించి అసూయ పడేదాన్ననీ, ఆయన్ని ఆరాధించే దాన్ననీ, ఆయనకి లొంగాననీ తలుచుకుంటే! ఆయన ఆదర్శవంతమైన భర్త అనీ, ప్రేమగా దయగా ఉంటారనీ అనుకునేదాన్ని. అలాంటిది, ఆయనలో మూర్ఖత్వం, కపటత్వం ఉన్నవని తెలుసుకోగానే ఆయన మీద ద్వేషం ఏర్పడింది. ఆయనతో నాకసలు సంబంధం అనేది ఉండేదనుకుంటేనే నేను అపరిశుభ్రం అయినట్లుగా అనిపిస్తోంది. ఆయన్నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నాను."

మీరు ఆయన్నుంచి శారీరకంగా స్వేచ్ఛగా అయి ఉండవచ్చు. కాని మీకు ఆయనపైన ద్వేషం ఉన్నంతకాలం మీకు ఆయన నుంచి స్వేచ్ఛ లభించదు. మీరు ఆయన్ని ద్వేషిస్తే ఆయనతో బంధింపబడే ఉంటారు. మీకు ఆయనంటే తలవంపులుగా ఉన్నట్లయితే ఆయన క్రింద మీరింకా బానిసగానే ఉంటారు. మీకు ఆయనమీద కోపమా, లేక మీమీదేనా? ఆయన ఉన్నట్లు ఆయన ఉన్నారు. దానికి ఆయనమీద కోపం దేనికి? మీ కోపం నిజంగా ఆయన మీదేనా, లేక ఉన్న స్థితిని చూసిన మీదట దానితో మీకు సంపర్కం ఉన్నందుకు మీరంటే మీకు తలవంపులుగా ఉందా? మీ ద్వేషం