పుట:Mana-Jeevithalu.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
180
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నదిలో నీళ్లు నాట్యం చేస్తున్నాయి - సూర్యుడు వాటిమీద వెలుగు బాటని వేశాడని. తెల్లని తెరచాప కట్టిన పడవ ఒకటి ఆ త్రోవన వెళ్లింది. కాని ఆ నాట్యానికి ఆటంకం కలగలేదు. పరిపూర్ణ ఆనందంతో చేసే నాట్యం అది. చెట్ల నిండా ఉన్నాయి పక్షులు - అరుస్తూ, ముక్కుల్తో ఈకలు సవరించుకుంటూ, ఎగురుతూ, మళ్లీ వెనక్కి వస్తూ. ఎన్నో కోతులు లేత ఆకుల్ని తెంపి నోటినిండా కుక్కుకుంటున్నాయి. వాటి బరువుకి లేత కొమ్మలు పొడుగ్గా వంపులు తిరుగుతున్నాయి. అయినా వాటిని ఎంతో తేలిగ్గా పట్టుకుని ఉన్నాయి భయపడకుండా. ఎంతో సునాయాసంగా ఒక కొమ్మ మీంచి మరో కొమ్మ మీదికి జరుగుతున్నాయి. గెంతుతున్నా ప్రవహిస్తున్నట్లుంది - ఎగరటమూ మళ్లీ దిగటమూ ఒక చలనంలా ఉంది. తోకలు వ్రేలాడేసుకుని కూర్చుని ఆకుల్ని అందుకుంటున్నాయి. అవి బాగా పైకి ఉన్నాయి. క్రింద వెడుతున్న మనుషుల్ని పట్టించుకోవటం లేదు. చీకటి పడుతూంటే వందలకొద్దీ చిలకలు ఆకుల గుబురుల్లో రాత్రికి తలదాచుకోవటానికి వస్తున్నాయి. అవి వస్తూనే చెట్ల ఆకుల్లో మాయమై పోతున్నాయి. పాడ్యమి చంద్రుడు కొద్దిగా కనిపిస్తున్నాడు. దూరంగా రైలు కూత పెట్టింది - నది వంపు తిరిగిన చోట వంతెనమీంచి దాటిపోతూ. ఈ నది పవిత్రమైనది. ఎంతో దూరాల నుంచి వస్తారు జనం అందులో స్నానం చెయ్యటానికి, తమ పాపాలు అందులో కొట్టుకు పోవచ్చునని. ప్రతి నదీ అందంగానూ పవిత్రంగానూ ఉంటుంది. ఈ నది అందమంతా దాని వెడల్పాటి పెద్ద వంపూ, లోతుగా పారే నీటిలో మధ్యమధ్య ఇసుక తిన్నెలూ, ప్రతిరోజూ నది మీద ఇటూ అటూ పోయే తెల్లని తెరచాపలున్న పడవలూ

"ఆ బంధం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను" అందావిడ.

స్వేచ్ఛగా ఉండాలని కోరటంలో మీ ఉద్దేశం ఏమిటి? "నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నాను" అనగానే మీరు స్వేచ్ఛగా లేరనే అర్థమవుతుంది. ఏవిధంగా మీరు స్వేఛ్చగా లేరు?

"శారీరకంగా స్వేచ్ఛగానే ఉన్నాను. రావటానికీ, పోవటానికీ స్వేచ్ఛ ఉంది, నేను ఇప్పుడు భార్యని కాదు కాబట్టి. కాని నాకు సంపూర్ణ స్వేచ్ఛ