పుట:Mana-Jeevithalu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

లేకుండా ఉండటానికీ. మీ సొంతంది అంటూ ఎక్కువగా లేకపోవచ్చు. కాని మీతో కలిసి ఉండటానికైనా ఎవరో ఒకరున్నారు. ఈ పరస్పర అవసరాన్నే, ఉపయోగాన్నే ప్రేమ అంటున్నాం.

"కాని అది ఘోరం"

అది ఘోరం కాదు. ఎటొచ్చీ మనం దానివైపు ఎప్పుడూ చూడం. దాన్ని ఘోరం అని చెప్పి, దానికో పేరు పెట్టి, వెంటనే చూపు మరోవైపుకి తిప్పుకుంటాం - అదే మీరు చేస్తున్నది.

"నాకు తెలుసు. కాని, నాకు చూడాలని లేదు. నేను ఉన్నట్లుగానే ముందుకూడా ఉండాలనుకుంటున్నాను. - అసూయ పడుతూనైనా సరే. నా జీవితంలో చూడగలిగిందంతకన్న ఏమీలేదు."

ఇంకో దాన్ని దేన్నైనా చూడగలిగితే అప్పుడు మీ భర్త అంటే మీకు ఆపైన అసూయ ఇక ఉండదా? అయితే, అప్పుడు దాన్ని పట్టుకు ప్రాకులాడుతారు. ఇప్పుడు మీ భర్తని పట్టుకుని ప్రాకులాడినట్లు, అంచేత, అదంటే కూడా మీకు అసూయ కలుగుతుంది. మీ భర్తకి ప్రయత్యామ్నాయంగా మరొకటి వెతుక్కోవాలనుకుంటున్నారు మీరు - అంతేగాని అసూయకి విముక్తికాదు. మనమంతా అంతే. ఒకటి వదిలేసేముందు ఇంకొకటి ఉంటుందన్నది నిశ్చయంగా తెలియాలనుకుంటాం. మీరు పూర్తిగా సందేహ స్థితిలో ఉన్నప్పుడే ఈర్ష్యకి తావుండదు. నిశ్చయంగా ఉన్నప్పుడు, మీ దగ్గర ఏదో ఉన్నదని అనుకుంటున్నప్పుడు ఈర్ష్య ఉంటుంది. తమ ఒక్కరి సొంతమే అనే భావమే నిశ్చయం. సొంతం చేసుకోవటం అంటే అసూయపడటమే. సొంతం చేసుకున్నది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ప్రేమ ఉండదు. సొంతం చేసుకోవటమంటేనే ప్రేమని నాశనం చెయ్యటం.

"నేను ఇప్పుడే గ్రహించగలుగుతున్నాను. నా భర్తని ఎప్పుడూ నిజంగా నేను ప్రేమించలేదు. ఎప్పుడైనా ప్రేమించానా? నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది."

ఆవిడ ఏడ్చింది.