పుట:Mana-Jeevithalu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమస్య, ప్రతిక్రియ (సవాలు చేయడం : సమాధానం)

173

తన్ను తాను చిత్రవధ చేసుకుంటూ ఉంటుంది. నిద్రపోతున్నా, నడుస్తున్నా ఆలోచన నిత్యకల్లోలితంగా ఉంటుంది. దానికి శాంతి గాని విశ్రాంతి గాని ఉన్నట్లు లేదు."

ఆలోచన ఎప్పుడైన శాంతితో ఉండగలదా? శాంతి గురించి ఆలోచించ గలదు. శాంతియుతంగా ఉండాలని ప్రయత్నించగలదు. నిశ్చలంగా ఉండాలని తన్ను తాను నిర్బంధించుకోగలదు, కాని ఆలోచన అనేదే ప్రశాంతంగా ఉండగలదా? అవిరామంగా ఉండటమే ఆలోచన ప్రకృతి కాదా? నిత్య సమస్యకి నిత్య ప్రతిక్రియ కాదా అది? సమస్యకి ఆగిపోవటం అనిలేదు - జీవితంలోని ప్రతిక్షణమూ ఒక సవాలు కాబట్టి. అ సవాలు గురించి తెలుసుకుని ఉండినట్లయితే క్షీణించటం, నశించటం జరుగుతుంది. సవాలు చేయటం, దానికి ప్రతిక్రియ - ఇదే జీవనవిధానం. ప్రతిక్రియ చాలినంత ఉండవచ్చు. ఉండకపోవచ్చు. సమస్యకి ప్రతిక్రియ చాలనప్పుడే ఆలోచన రేకెత్తుతుంది, అవిశ్రాంతంగా. సమస్య చర్య తీసుకోమంటుంది - మాటలలో పెట్టటం కాదు. మాటలలో పెట్టటమే ఆలోచన. మాట, సంకేతం - ఇవి చర్యని సరిగ్గా రూపొందనివ్వవు. ఊహే మాట. జ్ఞాపకమూ మాటే. సంకేతం లేకుండా, మాట లేకుండా జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం అంటే మాట, ఆలోచన. సమస్యకి నిజమైన ప్రతిక్రియ ఆలోచనేనా? సమస్య ఓక ఊహా? సమస్య ఎప్పుడూ కొత్తగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆలోచనా, ఊహా ఎప్పుడైనా కొత్తగా ఉంటాయా? ఆలోచన నిత్యనూతనమైన సమస్యని కలుసుకున్నప్పుడు ఏర్పడిన ప్రతిక్రియ పాతదాన్నుంచీ, గతించిన దాన్నుంచీ వచ్చినది కాదూ?

ఒక పాతదీ, ఒక కొత్తదీ కలిస్తే అ కలయిక సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణత కోసం అవిరామంగా అన్వేషించే ఆలోచనే ఈ అ అసంపూర్ణత. ఆలోచనా, ఊహా ఎప్పుడైనా సంపూర్ణమవుతాయా? ఆలోచన, ఊహ జ్ఞాపకానికి ప్రతిక్రియ. జ్ఞాపకం ఎప్పుడూ అసంపూర్ణమైనదే. అనుభవం సమస్యకి ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియ గతంచేతా, జ్ఞాపకం చేతా ప్రభావితం, నిబద్ధితం అయి ఉంటుంది. ప్రతిక్రియ ఆ ప్రభావాన్నీ, నిబద్ధతనీ పటిష్ఠం చేస్తుంది. అనుభవం విముక్తి కలిగించదు. నమ్మకాన్నీ, జ్ఞాపకాన్నీ పటిష్ఠం చేస్తుంది. ఈ జ్ఞాపకమే సమస్యకి ప్రతిక్రియ జరిగేటట్లు చేస్తుంది. అందువల్ల