పుట:Mana-Jeevithalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నది, ఉండవలసినది

157

కుదరదు. ఈ అసంతుష్టి అనేది సంతృప్తి కలగలేదని తెలుసుకోవటం వల్ల ఏర్పడినదా? తృప్తి కలిగినట్లయితే మీ అసంతుష్టి మాయమవుతుందా? ఒక విధమైన శాశ్వతమైన సంతృప్తికోసం ప్రయత్నిస్తున్నారా నిజానికి?

"లేదు. అది కాదు. నేను ఏ విధమైన తృప్తికోసం ప్రయత్నించటం లేదు. అధమం, అలా చేస్తున్నానని అనుకోను నేను. నాకు తెలిసిందల్లా అయోమయంలో, సంఘర్షణలో ఉన్నాననీ, దాంట్లోంచి బయట పడే మార్గం కనిపించటం లేదనీ."

మీరు సంఘర్షణలో ఉన్నారని మీరంటున్నారంటే, అది దేనికో సంబంధించి ఉండే ఉంటుంది. మీ భర్తతో కానీ, లేదా పిల్లలతో కానీ, లేదా మీ కార్యకలాపాలతో కానీ సంబంధం ఉన్నదై ఉంటుంది. మీ సంఘర్షణ ఈ రకమైనదేదీ కాదని అన్నట్లయితే మీ సంఘర్షణ మీరున్న స్థితికీ, మీరు కోరుకుంటున్న స్థితికీ మధ్య సంఘర్షణ అయి ఉండాలి. వాస్తవానికీ, ఆదర్శానికీ మధ్యా, ఉన్నదానికీ ఉండవలసినది అనే కల్పనకీ మధ్యా సంఘర్షణ. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకో అభిప్రాయం ఉంది. ఈ స్వయంకల్పితమైన పద్ధతి ప్రకారం ఉండాలన్న కోరికవల్లనే సంఘర్షణా, అయోమయ స్థితీ ఏర్పడి ఉండవచ్చు. మీరున్నట్లుగా కాకుండా ఇంకెలాగో ఉండాలని మీరు గిలగిల్లాడుతున్నారు, అంతేనా?

"నేను ఎందువల్ల అయోమయంగా ఉన్నానో నేనిప్పుడే గ్రహించ గలుగుతున్నాను. మీరన్నది నిజమే అనుకుంటాను."

సంఘర్షణ వాస్తవంగా ఉన్నదానికీ కల్పనకీ మధ్య, మీరు ఉన్న స్థితికీ ఫలానాలా ఉంటే బాగుండునని మీరు అనుకునే స్థితికీ మధ్య వస్తుంది. కల్పిత రూపం చిన్నతనం నుంచీ పెంచుతారు. క్రమంగా విస్తృతమై, లోతుగా పాతుకుని వాస్తవికంగా ఉన్నదానికి విరుద్ధంగా పెరుగుతూ ఉంటుంది. అన్ని ఆదర్శాలూ, లక్ష్యాలూ ఊహా లోకాల మాదిరిగానే ఈ కల్పన స్పష్టంగా ఉన్నదానికీ, వాస్తవంగా ఉన్నదానికీ విరుద్ధంగా ఉంటుంది. అందుచేత మీరు ఉన్న స్థితి నుంచి తప్పించుకునేందుకు మార్గమే కల్పన. ఈ తప్పించుకునే మార్గం పరస్పరం వ్యతిరేకంగా ఉన్నవాటి మధ్య నిష్ప్రయోజన కరమైన సంఘర్షణని సృష్టిస్తుంది. అన్ని రకాల సంఘర్షణా - అంతరంగికంగా గాని,