పుట:Mana-Jeevithalu.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
156
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

లేనట్లూ నిస్పృహగా అసంతృప్తిగా అనిపిస్తోంది. నేనింకా వయస్సులో ఉన్నదాన్నే. కాని, భవిష్యత్తంతా చీకటి నిండినట్లుగా ఉంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కాని, అది ఎంత తెలివి తక్కువతనమో గ్రహించాను. నాకు అంతకంతకు అయోమయంగా ఉంటోంది. నా అసంతృప్తికి అంతం లేదనిపిస్తోంది."

దేన్ని గురించి మీకు అయోమయంగా ఉన్నట్లుంది? మీ సమస్య మీ సంబంధ బాంధవ్యాల గురించా?

"అబ్బే అదికాదు, అవన్నీ అయిపోయాయి. ఎలాగో చచ్చిచెడి బయటపడ్డాను. కాని నాకు మతిపోతోంది. ఏదీ నాకు సంతృప్తి నివ్వటం లేదు."

మీకేదైనా ప్రత్యేక సమస్య ఉందా, లేక అన్ని విధాలా అసంతృప్తికరంగా ఉన్నట్లు ఊరికే అనిపిస్తోందా? ఎక్కడో లోలోపల ఆదుర్దా, భయం ఉండి ఉండాలి. అది మీరు తెలుసుకోవటం లేదేమో. అదేమిటో తెలుసుకోవాలని కోరుతున్నారా?

"అవును. అందుకే మీ వద్దకు వచ్చాను. ఇప్పుడున్నట్లు ఇదే విధంగా ఇంక ఉండలేను. ఏదీ ముఖ్యమనిపించటం లేదు. తరుచు అస్వస్థతగా ఉంటోంది."

మీ అస్వస్థత మీ పరిస్థితుల నుంచి మీరు తప్పించుకునేందుకు మార్గం కావచ్చు.

"అదే అని నా నమ్మకం. కాని నేనేం చెయ్యాలి? నాకు నిజంగానే దారీ తెన్నూ తోచటం లేదు. నేను ఇక్కణ్ణించి వెళ్లేముందు దీన్నుంచి తప్పించుకునే మార్గాన్ని తెలుసుకుని తీరాలి."

సంఘర్షణ రెండు వాస్తవాల మధ్యగాని, వాస్తవమైనదానికీ, ఊహాజనితమైన దానికీ మధ్యగాని ఉన్నదా? మీ అసంతుష్టి కేవలం అసంతృప్తి మాత్రమేనా? అసంతృప్తి అయితే సులభంగానే తృప్తి కలిగించవచ్చు. లేక, నిష్కారణంగా దుఃఖపడటమా? అసంతృప్తి త్వరలోనే ఏదో మార్గం వెతుక్కుంటుంది తృప్తి పొందటానికి. ఆ అసంతృప్తిని త్వరలో ఒక మార్గాన పెట్టవచ్చు. కాని, అసంతుష్టిని ఆలోచన ద్వారా ఉపశమనం కలిగించటానికి