పుట:Mana-Jeevithalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యర్థ ప్రసంగం, వ్యాకులత

7

భయం దేన్నైనా ప్రతిఘటించి తీరుతుంది. అణచివేస్తుంది. స్వీయ రక్షణలో ఉన్నప్పుడు తెలియని సముద్రంలోకి పోవడానికి ఎలా సంసిద్ధపడతారు? తన స్వభావపు తీరుతెన్నులు తెలుసుకోకుండా సత్యంగాని ఆనందంగాని లభించదు. ఒకేచోట లంగరు వేసుకొని ఉంటే దూరప్రయాణం చేయలేరు. ఐక్యం చేసుకోవటంలో ఆశ్రయం లభిస్తుంది. ఆశ్రయానికి కూడా భద్రత కావాలి. దేన్నైతే రక్షిస్తామో అది ఎప్పుడో ఒకప్పుడు విధ్వంసం కాకమానదు. ఐక్యత తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటుంది. అందువల్లనే వివిధ ఐక్యతల మధ్య నిరంతర సంఘర్షణ ఉంది.

ఐక్యం కావటానికి గాని, దానికి వ్యతిరేకంగా గాని పోరాటం జరుగుతున్న కొద్దీ అవగాహనకి ప్రతిఘటన ఎక్కువవుతుంది. ఈ ఐక్యం కావటం అనేది ఎలా, ఎందుకు జరుగుతుందో, వ్యక్తంగాగాని - అవ్యక్తంగా గాని - లోపల ఉన్న కోరిక పైకి వ్యక్తమవుతుందని - అంతా తెలుసుకున్నట్లయితే ఏదైనా సాక్షాత్కారం కావటానికీ, ఆనందం కలగటానికీ, అవకాశం ఉంటుంది. తన్ను తాను దేనితోనైనా ఐక్యం చేసుకున్నవారు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోలేరు. స్వేచ్ఛలోనే సత్యం సాక్షాత్కరిస్తుంది.

3. వ్యర్థ ప్రసంగం, వ్యాకులత

వ్యర్థ ప్రసంగం, వ్యాకులత - రెండూ చిత్రంగా ఒకలాంటివే. రెండూ మనస్తిమితం లేకపోవడం వల్ల వచ్చేవే. మనస్తిమితం లేని మనస్సుకి ఏదో ఒక వ్యాపకం, ఎప్పటికప్పుడు వైవిధ్యం ఉండాలి. ఎప్పుడూ ఏదో హడావిడిలో ఉండాలి. ఎన్నో అనుభూతులూ, చిన్న చిన్న సరదాలూ కావాలి. వ్యర్థ ప్రసంగం చేయటంలో ఇవన్నీ ఉంటాయి.

గంభీరతకీ, చిత్తశుద్ధికీ విరుద్ధమైనది ఊరికే కబుర్లు చెప్పటం. ఇంకొకరి గురించి మంచిగా గాని, చెడ్డగాగాని మాట్లాడటం అంటే తన్ను తాను తప్పించుకోవటమే. ఈ తప్పించుకోవటమే వ్యాకులతకి కారణం. తప్పించుకోవటంలోనే ఉంటుంది సహజంగా - అస్తిమితత్వం. ఇతరుల