పుట:Mana-Jeevithalu.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
147
ఉత్తేజం

ఒప్పుకుంటూనే ఒప్పుకోవటం లేదు.

"మీరన్నది సరైనదే కావచ్చు. నేను ఇంతవరకు పోగుచేసినవన్నీ వదులుకోలేను - నా స్నేహితులు, నా జ్ఞానం, నా అనుభవం అవన్నీ వదులుకోవాలని నాకు తెలుసును. కాని, ఆ పనిచేయటం నా వల్లకాదు అంతే."

ఆయనలో సంఘర్షణ ఇప్పుడు మరింత ఎక్కువవుతుంది. ఉన్నదాన్ని తెలుసుకోగానే, ఎంత అయిష్టంగా ఉన్నా, మీ విశ్వాసాల కారణంగా ఎంత వద్దనుకున్నా, ప్రగాఢ వైరుధ్యం ప్రారంభమవుతుంది. ఈ వైరుధ్యం ద్వంద్వత్వం. రెండు వ్యతిరేకమైన కోరికలకు వంతెన కట్టడం కుదరదు. వంతెన కట్టినట్లయితే అది ప్రతిఘటనే, అంటే ఒకే రీతిలో ఉండటం. ఉన్నదాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ఉన్నదాన్నుంచి విముక్తి లభిస్తుంది.

అదొక విచిత్రమైన యథార్ధం - అనుసరించేవారు తమకు నయాన్నో భయాన్నో మార్గదర్శనం చేయించాలని కోరుకోవటం. కఠినంగా ప్రవర్తించటం నేర్పించే ఒకరకమైన పద్ధతి అనుకుంటారు - ఆధ్యాత్మిక సిద్ధిని పొందేందుకు ఇచ్చే శిక్షణలో బాధలు పడటం, తీవ్రమైన అఘాతం పొందటం, బాధ పెట్టటంలో ఉండే సంతోషంలో ఒక భాగమే. మార్గదర్శకుడూ, అనుచరుడూ - పరస్పరం కించపరుచుకోవటం అనుభూతి పొందాలనే కోరిక మూలాన్నే. మీకు ఇంకా గొప్ప అనుభూతి కావాలి కనుక మీరు అనుసరిస్తారు. దాని కోసం ఒక మార్గదర్శినో, ఒక గురువునో సృష్టిస్తారు. ఈ కొత్త రకం సంతృప్తి కోసం కొంత త్యాగం చేస్తారు. అసౌఖ్యాన్నీ, అవమానాలనీ, నిరుత్సాహం పొందటాన్నీ సహిస్తారు. ఇదంతా ఒకరి వల్ల ఒకరు లాభం పొందటానికే. దీనికి, నిజంగా ఉన్న స్థితికీ ఏమీ సంబంధం లేదు. ఇది ఎన్నటికీ ఆనందానికి దారి తీయదు.


48. ఉత్తేజం

"పర్వతాలు నాలో నిశ్శబ్దాన్ని కలిగించాయి" అందావిడ. "ఈ మధ్య ఎంగాడిన్‌కి వెళ్లాను. దాని సౌందర్యం నన్ను పూర్తిగా మౌనంగా చేసింది. ఆ అద్భుతాన్నంతా చూసి మూగదాన్నైపోయాను. అదొక బ్రహ్మాండమైన