పుట:Mana-Jeevithalu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధ్యాత్మిక మార్గదర్శి

143

కోవటానికి ఖండన జరక్కూడదు. సమస్యని సమర్థించటం జరగకూడదు. తెలుసుకొని ఉండటం ఇష్టాయిష్టాలు లేకుండా జరగాలి. ఆవిధంగా తెలుసుకోవటానికి ఎంతో ఓర్పు, సున్నితత్వం ఉండాలి. ఉత్సుకతా, నిర్వరామమైన శ్రద్ధా ఉండాలి - మొత్తం ఆలోచనా ప్రక్రియని గమనించటానికీ, అర్ధం చేసుకోవటానికీ.


47. ఆధ్యాత్మిక మార్గదర్శి

ఆయన గురువు వర్ణించటానికి వీల్లేనంత గొప్పవాడనీ, ఆయనకి తను చాలా ఏళ్లపాటు శిష్యుడిగా ఉన్నాననీ చెప్పాడాయన. ఆయన గురువు కఠినమైన అఘాతాలను కలిగిస్తూ దుర్భాషలాడుతూ, అవమాన పరిచే మాటల ద్వారా, చర్యల ద్వారా తన ఉపదేశాలను బోధపరిచేవాడుట. ఎంతో మంది ప్రముఖులు ఆయన్ని అనుసరించే వారిలో ఉన్నారని కూడా చెప్పాడాయన. ఆయన పద్ధతిలో ఉన్న మోటుతనమే మనుషుల్ని ఆలోచించేటట్లు చేసేదిట. లేచి కూర్చుని, చప్పున గ్రహించేటట్లు చేసేదిట. చాలామంది నిద్రావస్థలో ఉంటారు. అటువంటివారిని కుదిపి లేపి కూర్చోబెట్టటం అవసరం అన్నాడాయన. ఈ గురువు దేవుణ్ణి గురించి నానామాటలూ అనేవాడుట. ఆయన శిష్యులు ఎంతో తాగవలసివచ్చేదిట. ఎందుకంటే గురువు గారే భోజనంతో బాటు తెగ తాగేవాడుట. కాని, ఆయన బోధనలు మాత్రం ప్రగాఢంగా ఉండేవిట. ఒకప్పుడు వాటిని రహస్యంగా ఉంచేవారుట. ఇప్పుడు అందరికీ తెలియనిస్తున్నారట.

శరత్కాలపు సూర్యకాంతి కిటికీలోంచి పుష్కలంగా ప్రసరిస్తోంది. వీధి రొద అంతా వినిపిస్తోంది. ఎండిపోతున్న ఆకులు తళతళలాడుతున్నాయి. గాలి హాయిగా దట్టంగా వీస్తోంది. అన్ని నగరాల్లో లాగే ఒక విధమైన నిస్పృహ, చెప్పలేని బాధతో కూడిన వాతావరణానికి విరుద్ధంగా ఉంది సాయంకాలపు కాంతి. కృత్రిమమైన ఆనందోత్సాహం మరింత దుఃఖభాజనంగా ఉంది. సహజంగా ఉండటం అంటే ఏమిటో, హాయిగా నవ్వటం అంటే ఏమిటో మరిచిపోయినట్లున్నాం. మన ముఖాలు దుఃఖంతో, ఆదుర్దాతో ముడుచుకు