పుట:Mana-Jeevithalu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉద్యోగం అన్నా, మనుషులన్నా అంతకంతకు పెరుగుతున్న అయిష్టతా కూడా నాకు చికాకు కల్గిస్తున్నాయి. నేనెప్పుడూ కనికరం చూపించలేదు. భవిష్యత్తు గురించి ఆదుర్దా అధికమవుతోంది. శాంతి అన్నది ఉండటం లేదనిపిస్తోంది. నేను నా పని బాగానే నిర్వర్తిస్తాను, కాని. ...."

ఉన్నదానితో మీరు ఎందుకంత పోరాడుతున్నారు? నేను ఉంటున్న ఇల్లు గొడవగొడవగా మురికిగా ఉండొచ్చు. సామాను ఘోరంగా ఉండొచ్చు. ఎక్కడా అందం అనేది లేకుండా ఉండి ఉండొచ్చు. కాని, అనేక కారణాల వల్ల నేను అక్కడే ఉండవలసి రావచ్చు. ఇంకో ఇంటికి వెళ్లిపోలేను. అప్పుడు, ఉన్న వాటిని స్వీకరించాలన్న ప్రశ్నకాదు, స్పష్టంగా కనిపిస్తున్న వాటిని చూడటం ఉన్న దాన్ని నేను చూడనట్లయితే, ఆ పూలకుండీ చూసినా, ఆకుర్చీ చూసినా, ఆ బొమ్మ చూసినా రోత పుట్టేలా బాధపడతాను. అవే నా వెర్రి భ్రమలైపోతాయి. ఇక మనుషులన్నా, నా ఉద్యోగమన్నా, ఏమన్నా రోత పుడుతుంది. అవన్నీ వదిలేసి మళ్లీ మొదలుపెడితే అది వేరే సంగతి. కానీ, అలా చెయ్యలేను. ఉన్నదాన్ని గుర్తించటం నిరాసక్తమైన తృప్తికీ, నిర్లక్ష్యానికీ దారి తీయదు. ఉన్నదానికి నేను లొంగినట్లయితే, అది అవగాహన అవటమే కాకుండా ఒక విధమైన ప్రశాంతత వస్తుంది పైపై మనస్సులో. పైపై మనస్సు శాంతంగా లేనట్లయితే, అది పిచ్చి భ్రమలలో పడుతుంది - వాస్తవమైనవైనా, ఊహామయమైనవైనా; సంఘసేవలోనో, మత విశ్వాసంలోనో - గురువూ, రక్షకుడూ, పూజలూ వంటివి. పైపై మనస్సు శాంతంగా ఉన్నప్పుడే నిగూఢంగా ఉన్నది విశదమవుతుంది. నిగూఢంగా ఉన్నదాన్ని బయటపెట్టాలి. కాని, పైపై మనస్సు వెర్రిభ్రమలతో, ఆదుర్దాలతో బరువై పోయినప్పుడు అది సాధ్యం కాదు. పైపై మనస్సు నిత్యం ఏదో ఒక ఆందోళనలో ఉంటుంది. కనుక మనస్సు పై పొరలకీ, లోలోపలి పొరలకీ సంఘర్షణ తప్పదు. ఈ సంఘర్షణ పరిష్కారం కానంతవరకూ వెర్రిభ్రమలు అధికమవుతాయి. ఈ వెర్రిభ్రమలు మన సంఘర్షణ నుంచి తప్పించుకోవటానికి మార్గాలే కదా. తప్పించుకునే మార్గాలన్నీ ఒకలాంటివే - కొన్ని సాంఘికంగా ఎక్కువ హానికరమైనవైనప్పటికీ.

వెర్రిభ్రమగాని, ఏ సమస్యగాని, దాని మొత్తం ప్రక్రియని తెలుసుకున్నప్పుడే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. సంపూర్ణంగా తెలుసు