పుట:Mana-Jeevithalu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెర్రిభ్రమ

141

కారణం కనుక్కోగలిగినంత మాత్రాన ఫలితం నుంచి విముక్తి కలుగుతుందా? కారణం తెలిసినందువల్ల ఫలితం పోతుందా? యుద్ధానికి కారణాలు ఆర్థికమైనవీ, మానసికమైనవీ మనకి తెలుసును. అయినా, రాక్షసత్వాన్నీ, ఆత్మవినాశాన్నీ ప్రోత్సాహపరుస్తున్నాం. కారణాన్ని వెతకటంలో మన ఉద్దేశం ఫలితాన్ని తప్పించుకోవాలనే కదా. ఈ కోరిక ఇంకో రకమైన ప్రతిఘటన, లేదా ఖండన. ఖండన ఉన్నప్పుడు అవగాహన ఉండదు.

"అయితే ఏం చెయ్యాలి" అని అడిగాడాయన.

మనస్సు ఈ అల్పమైన తెలివి తక్కువ భ్రమల ఆధీనంలో ఎందు - కుంటోంది? "ఎందుకు" అని అడగటం,మీరు కాకుండా వేరే ఇంకేదైనా కారణం ఉందేమో కనుక్కోవాలని ప్రయత్నించటం కాదు. మీ ఆలోచనా ధోరణి గురించి తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. ఇంతకూ మనస్సు ఆ విధమైన గొడవ ఎందుకు పడుతోంది? అది పైపైనే ఉండేదీ, వెలితిగా, అల్పంగా ఉండేదీ కనుకనూ, అందువల్లనే తన ఆకర్షణల్లో తానే పడుతున్నది కనుకనూ కాదా?

"అవును" అని సమాధానమిచ్చాడు. "అది నిజమే అనిపిస్తోంది. కాని పూర్తిగా కాదు. ఎందుకంటే, నేను ప్రతి విషయం గురించీ తీవ్రంగా ఆలోచిస్తాను" అన్నాడు.

ఈ వెర్రిభ్రమలు కాక, మీ ఆలోచనలింకా దేన్ని గురించి?

"నా ఉద్యోగం గురించి" అన్నాడు. "నేనొక బాధ్యత గల పదవిలో ఉన్నాను. రోజంతా ఒక్కొక్కప్పుడు బాగా రాత్రి వరకూ నా ఆలోచనలన్నీ నా వ్యవహారాల గురించే. తరుచు చదువుతూ ఉంటాను. కాని, నా సమయమంతా చాలావరకు నా ఉద్యోగ నిమిత్తమే ఖర్చవుతుంది."

మీరు చేస్తున్నపని మీ కిష్టమేనా?

"ఆ, కాని పూర్తిగా సంతృప్తికరం కాదు. నా జీవితమంతా నేను చేస్తున్నదానితో అసంతృప్తి పడుతూనే ఉన్నాను. కాని, నా ప్రస్తుత పదవిని నేను వదులుకోలేను. ఎందుకంటే, నాకింకా కొన్ని బాధ్యతలున్నాయి. పైగా వయస్సు పైబడుతోంది. నాకు చికాకు కలిగిస్తున్నవి ఈ వెర్రిభ్రమలే, నా