పుట:Mana-Jeevithalu.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
139
నగరంలో జీవితం

- ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అని. డబ్బుండటం, దానితో వచ్చే బాధ్యతలూ ఆయన్ని కొంత చికాకు పెడుతున్నాయిట. ఆయన దాన్ని సమస్యలా ఎందుకు చూస్తున్నాడు? ఎవరికిచ్చాడో, ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అంత ముఖ్యమైనదా? అది సమస్యగా ఎలా పరిణమించింది?

ఆయన భార్య వచ్చింది. ఆకర్షణీయంగా, కాంతివంతంగా, కుతూహలంతో ఉన్నట్లుగా ఉంది. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్లు, మర్యాదస్తులు, ప్రాపంచిక విషయాల్లో శ్రద్ధ ఉన్నవాళ్లు, తెలివైన వాళ్లు. ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉంది. ఇద్దరూ కూడా చిన్న ఊరు నుంచీ, గ్రామం నుంచీ వచ్చిన వాళ్లే. వారి హృదయాలు ఇంకా చిన్న ఊరులోనే ఉన్నాయి. ఆ ఒక్కటి - దయ అనేది ఎంతో దూరమై పోయినట్లుగా అనిపిస్తోంది. మనోలక్షణాలను ఎంతో శ్రద్ధగా పోషించుకున్నారు - ఒక విధమైన వాడితనం, కరుకుగా ప్రవర్తించటం. కానీ వాటివల్ల ఏమీ లాభం లేకపోయింది. ఆవిడ కొద్ది రచనలు చేసింది. ఆయన ఒకరకంగా రాజకీయ వేత్త. ఎంతో సునాయాసంగానూ, భరోసాతోనూ మాట్లాడారు వాళ్లు. ఏదైనా ఆవిష్కారం కావాలన్నా అవగాహన కావాలన్నా సందేహావస్థలో ఉండటం అవసరం. మీ కంతగా తెలిసి ఉన్నప్పుడు - ఆత్మ రక్షణ చేసుకునే కవచం అంతమెరిసేటట్లు పెట్టుకున్నప్పుడు ఏ మాత్రమూ బీటలూ పడకుండా లోపలనుంచి తాపడం చేసినప్పుడు సందేహావస్థ ఎలా ఉంటుంది? అనుభూతి కలిగించే వాటి బంధనంలో చిక్కుకున్నవారికి రేఖారూపాలు అసాధారణమైన ప్రాముఖ్యం గలవై ఉంటాయి. అప్పుడు అందం ఒక అనుభూతి, మంచితనం ఒక ఊహ, సత్యం సహేతుకంగా నిర్ణయించవలసినదీ అవుతుంది. అనుభూతులు ఆధిక్యం వహిస్తే సౌఖ్యం అత్యవసరమైపోతుంది - శరీరానికే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా - ముఖ్యంగా, మానసికంగా హరించి వేస్తూ భ్రమకి దారితీస్తుంది.

మనం సొంతం చేసుకున్నవే మనం. మనం వేటితో బంధం పెంచుకున్నామో అవే మనం. బంధనానికి ఔన్నత్యం ఉండదు. జ్ఞానంతో బంధం పెంచుకోవటానికీ, మరింకేదో సంతృప్తి కలిగించే దురలవాటుకీ తేడా లేదు. దేనితోనైనా బంధనం పెంచుకోవటం తన గొడవలో తాను మునిగి ఉండటమే - నీచ స్థాయిలోనైనా, ఉన్నతస్థాయిలోనైనా, బంధనం