పుట:Mana-Jeevithalu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియ, భావం

137

నిగ్రహించటానికి ఊహని పెంపొందించటం జరుగుతుంది. చర్యని ఆపుచేయటానికి భావం ఏర్పడుతుంది. క్రియలో మీరు నిజంగా ఔదార్యంగా ఉంటే ఏమవుతుంది? అందుచేత మీ హృదయంలోని ఔదార్యానికి వ్యతిరేకంగా మానసిక ఔదార్యం ఉంటుంది. మీరు అంతవరకే వెడతారు - రేపు ఏమవుతుందో మీకు తెలియదు కనుక, క్రియని భావం తీర్చిదిద్దుతుంది. క్రియ పరిపూర్ణంగా విశాలంగా, విస్తృతంగా, ఉంటుంది. భయం ఊహలాగే ముందు కొచ్చి బాధ్యత తీసుకుంటుంది. అ విధంగా భావం అత్యంత ముఖ్యమవుతుంది - క్రియ కాదు.

క్రియ ఊహకి అనుగుణంగా ఉండాలి అని ప్రయత్నిస్తాం. అహింస అనేది భావం లేదా ఆదర్శం. మన చర్యలూ, చేష్టలూ, ఆలోచనలూ, అన్నీ మనసులో ఉన్న ఆ పద్ధతి ప్రకారం రూపొందుతాయి. మనం తినేదీ, కట్టుకునేదీ, చెప్పేదీ చాలా ముఖ్యం అవుతాయి. మన చిత్తశుద్ధిని వాటి ద్వారా నిర్ణయిస్తాం కాబట్టి, చిత్తశుద్ధి ముఖ్యమైపోతుంది, అహింసాయుతంగా ఉండటం కాదు. మీ చెప్పులూ, మీరు తినేదీ ఎంతో ఆసక్తికరమైన అంశాలవుతాయి. అహింసాయుతంగా ఉండటం మరిచిపోవటమవుతుంది. భావం ఎప్పుడూ అప్రధానమైనదే. అప్రధానమైన విషయాలే ప్రధానమైన దానిపైన ఆధిక్యాన్ని చూపిస్తాయి. మీరు భావం గురించి రాయవచ్చు, ప్రసంగించవచ్చు, కబుర్లు చెప్పవచ్చు. ఊహలో ఆత్మవిస్తరణకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అహింసాయుతంగా ఉండటంలో ఆత్మవిస్తరణ వల్ల కలిగే సంతృప్తి ఉండదు. ఊహ స్వయంకల్పితం కాబట్టి ఉత్తేజకరంగా సంతృప్తికరంగా ఉంటుంది - వ్యక్తంగా అయినా, అవ్యక్తంగా అయినా. కాని అహింసాయుతంగా ఉండటంలో ఆకర్షణ ఉండదు. అహింస కేవలం లక్ష్యం కాదు. అహింస ఒక ఫలితం, పక్క నుంచి పుట్టుకొచ్చింది మాత్రమే. భావం ఆధిపత్యం వహించినప్పుడు అది లక్ష్యం మాత్రమే అవుతుంది. భావం ఎప్పటికీ నిశ్చితాభిప్రాయం, లక్ష్యం, స్వయంకల్పిత లక్ష్యం. ఊహ అనేది తెలిసిన దానిలో జరిగే సంచలనం. కాని, అహింసాయుతంగా ఉండటం ఎలాగో ఆలోచన రూపొందించలేదు. ఆలోచన అహింస గురించి లోతైన ఆలోచనలు చేయవచ్చు. కాని, అది అహింసాయుతంగా ఉండలేదు. అహింస ఊహ కాదు. దాన్ని క్రియాత్మకంగా చేయటం సాధ్యం కాదు.