పుట:Mana-Jeevithalu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అనుకోవడం లేదా? ఈ స్వీయ ప్రత్యేకతనే సంబంధం అంటున్నాను. కాని, వాస్తవంగా ఈ ప్రక్రియలో సన్నిహిత సంపర్కం ఉండదు. భయం లేనప్పుడే సంపర్కం ఉంటుంది. ఉపయోగించటం, ఆధారపడటం ఉన్నప్పుడు నరాలు పిండే భయం, బాధా ఉంటాయి. ఏదీ ప్రత్యేకంగా వేరుగా ఉండలేదు కాబట్టి, మనస్సు తన్ను తాను ప్రత్యేకించుకునేందుకు చేసే ప్రయత్నాలు నిస్పృహకీ, దుఃఖానికీ దారితీస్తాయి. ఈ అసంపూర్ణ భావాన్ని తప్పించుకోవటానికి ఊహల్లోనూ, మనుషుల్లోనూ, వస్తువుల్లోనూ సంపూర్ణతని అన్వేషిస్తాం. అంచేత మనం మళ్లీ మొదటికి వస్తాం - ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ.

'నేను' యొక్క కార్యకలాపాలు ఆధిక్యం వహించినప్పుడు ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. ఏవీ 'నేను' యొక్క కార్యకలాపాలు, ఏవీ కావు - అని తెలుసుకోవటానికి నిరంతరం ధ్యానంతో చూడటం అవసరమవుతుంది. ఈ ధ్యానంతో చూడటం క్రమశిక్షణతో అలవరచుకున్నది కాదు. అది ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా విస్తారంగా తెలుసుకొని ఉండటమే. క్రమశిక్షణతో అలవడిన ధ్యానం "నేను"కు శక్తినిస్తుంది. అదొక ప్రత్యామ్నాయం, ఆధారం అవుతుంది. తెలుసుకొని ఉండటం అలా కాదు. అది స్వీయ ప్రోద్బలం వల్ల గాని, సాధన వల్ల గాని వచ్చినది కాదు. మొత్తం సమస్యలో ఉన్నదంతా - నిగూఢమైనదీ, పైపైన ఉన్నదీ కూడా అర్థం చేసుకోవటం అది. నిగూఢమైనది బయట పడాలంటే పైన ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. పైపై మనస్సు శాంతంగా ఉంటే గాని నిగూఢమైనదాన్ని బయటపెట్టలేము. ఈ ప్రక్రియ అంతా మాటలతో కూడినది కాదు. కేవలం అనుభవానికి సంబంధించిన విషయమూ కాదు. మాటల్లో వ్యక్తపరచటం మనస్సు మందకొడితనాన్ని సూచిస్తుంది. అనుభవం కూడబెట్టినదవటం వల్ల పునశ్చరణ అవుతుంది. తెలుసుకుని ఉండటం అంటే నిశ్చయానికి రావటం కాదు. లక్ష్య సూచన అంటే ప్రతిఘటన. దానికి ప్రత్యేకత కలిగించే లక్షణం ఉంది. తెలుసుకుంటూ ఉండటం అంటే ఉన్నదాన్ని ప్రశాంతంగా ఇష్టాయిష్టాలు లేకుండా గమనించటం. తెలుసుకుంటూ ఉన్నప్పుడు సమస్య దానంతటదే విప్పుకుంటుంది. ఆ విధంగా అది సంపూర్ణంగా అర్ధమవుతుంది.

ఏ సమస్య అయినా ఒక స్థాయిలోనే ఎన్నటికీ పరిష్కారం కాదు - అది