పుట:Mana-Jeevithalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆ సన్యాసి, సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన, ఆదర్శవాది - అందరూ రేపటి కోసం జీవిస్తున్నవారే. ప్రాపంచికరీత్యా వారు వృద్ధిలోకి రావాలని తాపత్రయ పడటంలేదు. గౌరవాలు జరగాలని గాని, ధనాన్ని గాని కీర్తిని గాని వాంఛించటంలేదు. కాని, వారి లోపల ఉన్నది మరోరకమైన ఆకాంక్ష. ఆదర్శ సమాజవాది ఒకవర్గంతో ఏకమైపోయి, ఆ వర్గానికే ప్రపంచాన్ని మార్చేశక్తి ఉంటుందని అనుకుంటున్నాడు. సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన ఔన్నత్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాడు. సన్యాసి తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాడు. వారంతా తామేదో అవాలనీ, ఏదో సాధించాలనీ, ఎలాగో విస్తరించాలనీ తాపత్రయ పడుతున్నారు. ఈ కోరిక శాంతినీ, సౌభ్రాతృత్వాన్నీ, మహోన్నత ఆనందాన్నీ లేకుండా చేస్తుందని గ్రహించలేక పోతున్నారు.

ఆకాంక్ష ఏరకమైనదైనా, సంఘం కోసంగాని, వ్యక్తిగతమోక్షం కోసంగాని, ఆత్మసిద్ధి కోసంగాని, తక్షణం చర్య తీసుకోకుండా తప్పించుకునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే. ఏదో అవాలనీ, ఏదో చెయ్యాలనీ కోరటం అంటే, ప్రస్తుతం దాని గురించి ఏవిధమైనా చర్యా తీసుకోవడంలేదనే కానీ రేపటి కన్న ఇప్పటికే విలువ ఎక్కువ. ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది. ఇప్పుడు అనే దాన్ని అర్ధం చేసుకోవడమే కాలం నుంచి విముక్తి పొందడం. పరిణామమంటే దుఃఖం; అంటే కాలం మరొక రూపంలో కొనసాగడం. పరిణామంలో అస్తిత్వానికి తావు లేదు. అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. పరిణామం అంటే కొద్ది మార్పులు మాత్రమే ఉన్న కొనసాగింపు. వర్తమానంలోనే - ఉన్న స్థితిలోనే సమూల పరివర్తనం ఉంటుంది.

2. తాదాత్మ్య భావన

మీరు ఇంకొక వ్యక్తితోగాని, ఒక వర్గంతోగానీ, ఒక దేశంతో గాని ఎందుకు తాదాత్మ్యం చెందుతారు? మిమ్మల్ని క్రిస్టియన్ అనీ, హిందువు అనీ