పుట:Mana-Jeevithalu.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
113
"నా మార్గం - మీ మార్గం"

ఉంది. తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు బుర్ర కొంచెం ఊపి, చిరునవ్వు నవ్వుతాడు - అది తన అభిప్రాయం మాత్రమే కాదు, అదే తుది సత్యం అన్నట్లుగా. ఆయన ఉద్దేశంలో ఆయనకున్న అనుభవాలే అధికార పూర్వకమైనవీ, నిశ్చితమైనవీ. "మీ అనుభవాలు మీకుండొచ్చును, కాని మీరు నన్ను ఒప్పించలేరు" అన్నాడు. "మీ మార్గాన్ని మీరు వెళ్లండి. నా మార్గం నాది. సత్యానికి అనేక మార్గాలున్నాయి. ఓ రోజున మనమంతా అక్కడ కలుసుకుందాం" అన్నాడు. ఆయన ఒక విధంగా స్నేహపూర్వకంగానే ఉన్నాడు. కానీ కచ్చితంగా ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో దివ్య ప్రభువులు నిజంగా లేకపోయినా, కనిపించే గురువులంతా యథార్థమే. వారికి శిష్యులు అవసరం. ఆయన మరికొందరితో కలిసి ఈ మార్గాన్నీ, వారి ఆధిపత్యాన్నీ స్వీకరించటానికి ఇష్టపడిన కొందరికి శిష్యరికం ప్రసాదించారట. కానీ, మరణించిన వారిలో మార్గదర్శకులైనట్టి వారిని ఆధ్యాత్మిక శక్తితో దర్శించిన వారితో తనకు గాని, తన తోటివారికి గాని సంబంధం లేదన్నాడు. దివ్య ప్రభువులను దర్శించటానికి సేవ చెయ్యాలి, కష్టపడాలి, త్యాగం చెయ్యాలి. చెప్పినదాన్ని అనుసరించాలి. కొన్ని సద్గుణాలను సాధన చెయ్యాలి. నమ్మకం ఉండటం అవసరం.

ఉన్నదాన్ని కనుక్కునేందుకు సాధనంగా, అనుభవం మీద ఆధారపడటం - భ్రమలో చిక్కుకోవటమే. కోరిక, తాపత్రయం అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి. సత్యాన్ని అవగాహన చేసుకోవటానికి సాధనంగా, అనుభవం మీద ఆధారపడటం - స్వాతిశయాన్ని పెంపొందించుకునే మార్గాన్ని అవలంభించటమే. అనుభవం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభించదు. జీవితాన్ని ఎదుర్కోవటానికి తగిన ప్రక్రియ కాదు అనుభవం. సమస్యని కొత్తగా స్వచ్ఛంగా చూడాలి - సమస్యలెప్పుడూ కొత్తవే కనుక. సమస్యని దానికి తగినట్లుగా చూడాలంటే అనుభవాన్ని పరిమితం చేసే జ్ఞాపకాన్ని అవతలికి తోసెయ్యాలి. సంతోషం, బాధ అనే ప్రతిక్రియలను ప్రగాఢంగా అర్థ చేసుకోవాలి. అనుభవం సత్యానికి అవరోధం. ఎందువల్లనంటే, అనుభవం కాలానికి చెందినది. అంటే, గతం యొక్క ఫలితం. అనుభవంతోనూ, కాలంతోనూ ఏర్పడిన మనస్సు కాలరహితమైన దాన్ని ఎలా అర్థ చేసుకోగలదు? అనుభవం యొక్క నిజం వ్యక్తిగతమైన చాదస్తాలమీదా ఊహలమీదా