పుట:Mana-Jeevithalu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మరక్షణ

111

అనేది ఉండనే ఉండదు. అప్పుడు మనం మన వ్యక్తిత్వ రీతులకు - వ్యక్తంగా ఉన్నవైనా, అవ్యక్తంగా లోపల దాగి ఉన్నవైనా - వాటికి లొంగిపోయేటంత విపరీతంగా సున్నితంగా అయిపోతాం. కాని మనలో అనేక మంది ఈ "నేను" అనే ప్రక్రియని కనుక్కోవాలని కోరుకోరు. మన గురించి మనకున్న భావంతో, ఎవరినీ కలుగజేసుకోనివ్వం. మన గురించి మనకున్న భావం అంతా పైపైనే. అయితే మనలో చాలా మంది పైపైనే జీవిస్తూ ఉంటారు. భ్రమలతోనే తృప్తి పడుతూ ఉంటారు.

ఇంకొకరికి హాని కలిగించాలనే ప్రవృత్తి గాఢమైనది. మనస్సులో కూడ బెట్టిన ఉక్రోషం ఒక విధమైన జీవశక్తిని, ఒక క్రియానుభూతిని, జీవితానుభూతినీ ఇస్తుంది. కూడబెట్టినది ఖర్చవుతుంది - కోపం ద్వారా, అవమానం, నింద, పట్టుదల, వాటికి వ్యతిరేకమైన వాటి ద్వారా. ఈ ఉక్రోషాన్ని కూడబెట్టనందువల్లనే క్షమాగుణం అవసరమవుతుంది. మానసిక గాయాన్ని పదిలపరచకుండా ఉన్నప్పుడు అది అనవసరమే అవుతుంది.

పొగడ్తని, అవమానాన్నీ, మానసిక గాయాన్నీ, అనురాగాన్నీ ఎందుకు పదిలపరుస్తూ ఉంటాం? ఈ అనుభవాలనూ, ఈ ప్రక్రియలనూ కూడబెట్టటమే లేకుంటే మనమే ఉండం. మనకి పేరు, మమకారం, నమ్మకం లేనట్లయితే మనం ఏమీ కాము. ఏమీ కాకుండా ఉంటామనే భయమే కూడబెట్టేటట్లు తొందరపెడుతుంది.

ఈ భయమే - వ్యక్తమైనది గాని, అవ్యక్తమయినది గాని - మనకి ఎన్ని కూడబెట్టే కార్యకలాపాలున్నా, మన విచ్ఛిన్నతకీ, వినాశానికీ కారకమవుతుంది. ఈ భయం యొక్క సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనల్ని స్వేచ్ఛగా ఉండనిస్తుంది సత్యం - అంతేకాని, స్వేచ్ఛగా ఉండాలని నిర్ణయం తీసుకున్నందువల్ల కాదు.

మీరు ఏమీ కాదు. మీకు పేరు, బిరుదు ఉండొచ్చును. ఆస్తి, బ్యాంకులో డబ్బూ ఉండొచ్చును. మీకు అధికారం ఉండి, పేరు పొందిన వారు కావచ్చు. ఈ రక్షణలన్నీ ఉన్నప్పటికీ, మీరు ఏమీ కానట్లుగానే ఉంటారు. ఏమీ కాకపోవటమనే దాన్ని గురించీ, ఈ శూన్యత గురించీ, మీరు