పుట:Mana-Jeevithalu.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
109
ఆత్మరక్షణ


కొనసాగేది, ఉన్నదే గాని మరొకటి కాజాలదు, ఉన్నదానిలోనే కొద్ది మార్పులు ఉంటాయి. కాని ఈ మార్పులు దానికి కొత్తదనాన్నివ్వలేవు. వేరే వేషం వేసుకోవచ్చు, వేరే రంగు పూసుకోవచ్చు, అయినా, అది అప్పటికీ భావమే, జ్ఞాపకమే, మాట మాత్రమే. ఈ కొనసాగింపుకి ముఖ్యకేంద్రం ఆధ్యాత్మిక సారం కాదు. ఎందువల్లనంటే, అది అప్పటికీ ఆలోచనా రంగానికీ, జ్ఞాపకానికీ చెందినది కావడంతో కాలానికి కూడా చెందినదవుతుంది. తాను కల్పించిన దాన్నే అది అనుభవం పొందగలదు. ఆ స్వయంకల్పిత అనుభవాన్ని మరికొంత పొడిగింపు చేస్తుంది. ఆ విధంగా అది ఉన్నంతకాలం దాన్ని మించి దేన్నీ అనుభవం పొందలేదు. అది గతించాలి. భావం ద్వారా, జ్ఞాపకం ద్వారా, శబ్దం ద్వారా కొనసాగటం జరగకుండా అది అంతమొందాలి. ఆ కేంద్రం అంతం కావటంతోనే పునరావిర్భవించటం జరుగుతుంది. ఆ పునఃసృష్టి, కొనసాగింపు కాదు. మరణం కూడా జీవితం లాగే పునరావిర్భవిస్తుంది. ఈ పునరావిర్భావమే సృష్టి.


39. ఆత్మరక్షణ

ఆయన బాగా పేరున్నవాడు. ఇతరులకు హాని కలిగించగల స్థితిలో ఉన్నాడు. అది చెయ్యటానికి ఆయన సందేహించడు. కపటంగా, అల్ప బుద్ధితో ఉంటాడు. ఔదార్యం అనేది లేకుండా, తన బాగుకోసమే కృషిచేస్తాడు. అన్నీ మాట్లాడి తెలుసుకోవాలనే ఉత్సుకతతో రాలేదనీ, పరిస్థితుల ప్రోద్భలం వలన రావలసి వచ్చిందనీ, అందుకే తను ఇక్కడికి వచ్చాననీ చెప్పాడాయన. ఆయన చెప్పిన దాన్నంతటిని బట్టీ, చెప్పని దానిని బట్టీ చూస్తే ఆయన చాలా తీవ్రమైన ఆకాంక్ష కలవాడనీ, తన చుట్టూ ఉన్న వారిని తానే తీర్చిదిద్దుతాడనీ, తనకు లాభం ఉన్నప్పుడు నిర్దయగా వర్తిస్తాడనీ, ఆయనకేదైనా కావలసి వచ్చినప్పుడు సౌమ్యంగా ఉంటాడనీ బాగా స్పష్టమవుతోంది. ఆయనకి తనపైన ఉండే వాళ్లంటే గౌరవం. సాటి వారిని ఓర్పుతో సహిస్తాడు. తన క్రింది వాళ్లని బొత్తిగా లెక్క చెయ్యడు. తన్ను తీసుకు వచ్చిన కారు డ్రైవరుని కన్నెత్తి అయినా చూడడు. ఆయనకున్న స్నేహితులు చాలా కొద్దిమంది. ఆయన