పుట:Mana-Jeevithalu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనసాగించటం

107

నమ్మకాని బలపరుస్తుంది. మీరు నమ్మిన దాన్నే మీరు అనుభవం పొందుతారు. ఏం చెయ్యాలో మనస్సు శాసిస్తుంది. అనుభవాన్ని అనువదించి చెబుతుంది. దాన్ని ఆహ్వానిస్తుంది, లేదా, తిరస్కరిస్తుంది. మనస్సే అనుభవం యొక్క పర్యవసానం. మనస్సు దానికి పరిచయమైన దాన్నీ, తెలిసిన దాన్నే గుర్తు పడుతుంది, లేదా, అనుభవం పొందుతుంది - ఏస్థాయి లోనైనా సరే. అంతవరకు తెలియని దాన్ని అనుభవం పొందలేదు మనస్సు. అనుభవం కన్న మనస్సూ, దాని ప్రతిక్రియా ఎక్కువ అర్థవంతమైనవి. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి అనుభవం మీద ఆధారపడటం అజ్ఞానానికీ, భ్రమకీ లోను కావటమే. సత్యాన్ని అనుభవం పొందాలని కోరటం సత్యాన్ని కాదనటమే - ఎందువల్లనంటే, కోరిక ప్రభావితం చేస్తుంది కనుక. నమ్మకం అనేది కోరిక కప్పుకునే మరోవస్త్రం మాత్రమే.

జ్ఞానం, నమ్మకం, సహేతుకంగా నమ్మటం, నిశ్చయానికి రావాటం, అనుభవం - ఇవన్నీ సత్యానికి ప్రతిబంధకాలు. అవన్నీ కలిసి తయారైనదే ఆత్మ. మొత్తం అనుభవాల ఫలితం లేనట్లయితే ఆత్మ ఉండనే ఉండదు. ఉండటం, అనుభవించటం ఆఖరైపోతుందన్న భయమే మరణభయం. ఉంటుందనీ, అనుభవం పొందుతూ, ఉండటం నిశ్చయమనీ నమ్మకంగా తెలిసినప్పుడు భయం ఉండదు. తెలిసినదానికీ, తెలియనిదానికీ మధ్యనున్న సంబంధంలోనే భయం ఉంటుంది. తెలిసినది తెలియనిదాన్ని లోబరచు కోవాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. తెలిసినది తెలియనదాన్ని అనుభవం పొందటం అసాధ్యం. తెలియనిది ఉండాలంటే తెలిసినది అంతమొందాలి.

సత్యాన్ని అనుభవం పొందాలనే కోరికని వెతికి పట్టుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. కాని అన్వేషణలో ఒక ఉద్దేశం ఇమిడి ఉంటే సత్యం ఆవిర్భవించదు. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని, ఏ ఉద్దేశమూ లేకుండా అన్వేషణ జరగగలదా? ఉద్దేశం ఉన్నప్పుడు అది అన్వేషణ అవుతుందా? మీకు కావలసినది మీకు ముందే తెలిసినప్పుడు, మీ లక్ష్యాన్ని ముందే రూపొందించుకున్నప్పుడు కేవలం ఆ లక్ష్యసాధనమే మీ అన్వేషణ - అది స్వయం కల్పితం. అలా అయితే, అన్వేషణ సంతృప్తి కోసమే కాని సత్యం కోసం