పుట:Mana-Jeevithalu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాటలు

99

భ్రమలో చిక్కుకున్నట్లయితే, దాని వల తెంపుకుని బయట పడటం కష్టం. భ్రమని గుర్తుపట్టటం కష్టం. భ్రమని కల్పించినా, ఆ సంగతి మనస్సు గ్రహించలేదు. దాన్ని అవ్యక్తంగా, పరోక్షంగా చేరుకోవాలి. కోరిక తీరుల్ని అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే, భ్రమలో ఉండిపోవటం అనివార్యం. అవగాహన ఇచ్ఛానుసారంగా కలిగేది కాదు. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. మనస్సుని నిశ్చలంగా చేయలేము - అ చేసేది కూడా మనస్సే. అంటే, కోరిక తయారు చేసినదే కాబట్టి. ఈ ప్రక్రియ యావత్తూ తెలుసుకోవాలి. ఏ విధమైన మనోభీష్టం లేకుండా తెలుసుకోవాలి. భ్రమ పెంపొందకుండా ఉండటానికి అప్పుడే అవకాశం ఉంటుంది. భ్రమ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే దాన్ని అంటిపెట్టుకుని ఉంటాం. భ్రమవల్ల బాధ కలగవచ్చు. కాని ఆ బాధే మన అసంపూర్ణతని బయటపెట్టి, ఆ భ్రమతో మనల్ని మనం పూర్తిగా ఐక్యం చేసుకునేట్లు తొందరపెడుతుంది. ఆ విధంగా భ్రమకి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది ఉన్నదాన్ని - బాహ్యంగా కాదు - అంతర్గతంగా కప్పిపెట్టి ఉంచటంలో సహాయపడుతుంది. అంతర్గతంగా ఉన్నదాన్ని లెక్కచెయ్యకుండా ఉండటం వల్ల వినాశం, దుఃఖం సంభవిస్తాయి. ఉన్నదాన్ని దాచి పెట్టటం వలన భయం ఉంటుంది. ఇచ్ఛానుసారం వర్తించి భయాన్ని జయించలేము - ప్రతిఘటన వల్లనే ఇచ్ఛ పుడుతుంది కనుక. ఉదాసీనంగా ఉంటూ చురుకుగా తెలుసుకోవటం ద్వారానే భయం నుంచి విముక్తి లభిస్తుంది.


36. మాటలు

ఆయన విస్తారంగా చదివాడు. బీదవాడైనా, తను జ్ఞాన సంపన్నుడి ననుకుంటాడాయన. అందువల్ల ఆయనకి కొంత ఆనందం. ఆయన ఎన్నో గంటల సేపు పుస్తకాలు చదువుతూనూ, చాలా సేపు ఏకాంతంగానూ గడుపుతాడుట. ఆయన భార్య పోయింది. ఆయన పిల్లలిద్దరూ ఎవరో బంధువుల దగ్గర ఉంటున్నారు. ఈ బంధుత్వపు బెడదంతా తప్పించుకున్నందుకు కొంతవరకు సంతోషిస్తున్నాడాయన. ఆయన తన ఒక్కడితో