పుట:Mana-Jeevithalu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాఫల్యం

97

ఎప్పుడూ ఒక ఉద్దేశం ఉంటుంది. - స్వేచ్ఛ పొందాలనో, అర్థం చేసుకోవాలనో, లాభం పొందాలనో, ఇటువంటి కోరిక ఆత్మచైతన్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. అదే విధంగా ఆత్మపరీక్ష చేసుకుని తీసుకున్న నిర్ణయాలు కూడా ఆత్మజ్ఞానాన్ని అరికడతాయి.


35. సాఫల్యం

ఆవిడకి వివాహం అయింది. కాని పిల్లల్లేరు. ఐహికంగా సుఖంగానే ఉన్నట్లు చెప్పిందావిడ. డబ్బు ఆవిడకి సమస్య కాదుట. కార్లున్నాయి, మంచి హోటళ్లున్నాయి. అన్నిచోట్లకీ ప్రయాణం చెయ్యొచ్చు. ఆవిడ భర్త బాగా వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకున్న ఆసక్తి అంతా భార్యని ముస్తాబు చేయించటం, ఆవిడ సుఖంగా ఉండేలా చూడటం. ఆవిడ కోరినదల్లా సమకూర్చటం. ఇద్దరూ బాగా చిన్నవాళ్లే. కలిసిమెలిసి ఉంటారు. ఆవిడకి సైన్సులోనూ కళల్లోనూ ఆసక్తి ఉందిట. మతం విషయంలో కూడా కొంత ప్రవేశం ఉందిట. ప్రస్తుతం ఆధ్యాత్మిక విషయాలు తక్కిన వాటన్నిటినీ పక్కకి తోసేస్తున్నాయని చెప్పింది. వివిధ మతాలు ఏవేం బోధించాయో అవన్నీ ఆవిడకి తెలుసునట. కాని ఆ వ్యవస్థల సమర్థత, వాళ్ల ఆచారాలూ, ప్రగాఢ విశ్వాసాలూ ఆవిడకి నిరాశ కలిగించాయట. నిజమైన విషయాలను శోధించాలని గాఢంగా వాంఛిస్తున్నదట. ఆవిడ తీవ్రమైన అసంతృప్తితో ఉంది. ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లోని గురువుల వద్దకు వెళ్లిందట. కాని ఏదీ ఆవిడకి శాశ్వతమైన తృప్తినివ్వలేదుట. ఆవిడ అసంతృప్తి, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి, పిల్లలు లేకపోవటం వల్ల కలిగింది కాదు. ఆ విషయమై ఆవిడ చాలా ఆలోచించిందిట. ఆ అసంతృప్తి సాంఘిక విషయాల్లో ఆశాభంగం కలగటం వల్ల వచ్చిందీ కాదుట. కొంతకాలంపాటు ఆవిడ పేరు పొందిన వాళ్లలో ఒకరి చేత మనస్తత్వ విశ్లేషణ చేయించుకుందిట. అయినా, అంతరంగంలోని ఈ బాధ, శూన్యత ఇంకా అలాగే ఉన్నాయట.

సాఫల్యాన్ని కోరటం ఆశాభంగాన్ని కొని తెచ్చుకోవటానికే. ఆత్మకి సాఫల్యం అనేది లేదు. అది కోరినదల్లా సొంతం చేసుకొని, తన్ను తాను