పుట:MaharshulaCharitraluVol6.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

మహర్షుల చరిత్రలు


చించెదను. ఎవఁడు బ్రాహ్మణుఁడై పుట్టి వేదవిద్య నాదరించి పఠింపఁడో వాఁ డాజీవితము శూద్రసముఁడే యగును. ఏబ్రాహ్మణుఁడు పితృ . ప్రీతికై పిండదానము, తిలతర్పణము నొనరింపఁడో, వాఁడు శూద్రుఁడే యగును.

తూర్పుగాఁ దిరిగి కాని ఉత్తరముగాఁ దిరిగి కాని బ్రాహ్మణుఁ డాచమింపవలయును. పశ్చిమముగాఁ దిరిగి మరల నాచమించి దక్షిణముగాఁ దిరిగి స్నానము చేయవలయును. గోకర్ణకృతహస్తమున మాషమాత్రజలమునే ఆచమనమువేళఁ గైకొనవలయును. అంత కెక్కువై నను, దక్కువై నను ఆ జలము జలముకాదు: రుధిరసమ మగును. మిక్కిలి చల్లనివి, వేఁడివి, నురుఁగులతోఁ గూడినవి కాని జలమును బ్రాహ్మణుఁడు బ్రహ్మతీర్థముగా భావించి దృష్టిపూతముఁ గావించి యాచ మింపవలయును. త్రాగఁగా మిగిలిన జలము, కాళ్ళు కడుగుకొనఁగా మిగిలిన నీరు, వీని నాచమింపరాదు. "శ్రాద్ధవిషయిక విధివిధానముల ననంతముగా నాతఁడు తెలిపెను. ఈధర్మము లన్నియు ““వ్యాఘ్రపాద స్మృతి" యనఁ బరగుచున్నవి.