పుట:MaharshulaCharitraluVol6.djvu/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాఘ్రపాదమహర్షి

83

 శీతాంశుశోభిత కిరీట విరాజమానం
 ఫాలేక్షణానల వినాశిత పంచబాణమ్,
 నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్,

 పంచాననం దురితమ త్తమతంగజానాం
 నాగాంతకం దనుజపుంగవ పన్న గానామ్,
 దావానలం మరణశోక భయాటవీనాం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్. "

[వారాణసీపురపతేః పరమేశ్వరస్య
 వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్యః,
 విద్యాశ్శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
 సంప్రాప్య దేహవిలయే అభతే చ మోక్షమ్.]

వ్యాఘ్రపాదుని భక్తిభరితసం స్తవమున కలరి విశ్వేశ్వరుఁ డాతనికి సాక్షాత్కరించి కోరినవరము లొసంగి యనుగ్రహించెను.

వ్యాఘ్రపాదస్మృతి

ఒకప్పుడు మహర్షు లనేకులు వ్యాఘ్రపాదుని కడకు విచ్చేసి వేద విదులలో నగ్రగణ్యుఁడు, హుతాగ్ని హోత్రుఁడు, సర్వశాస్త్రవిదుఁడు నగు నాతనిని "మునీంద్రా! సర్వలోకహితముఁ గోరి మాకు ధర్మ సంగ్రహమును వివరింపుము" అని కోరిరి. అందులకు వారి నభినందించి “ఋషులారా! మీకు నేను యథాశక్తి సర్వముఁ దెలిపెదను. సావధానులై వినుఁడు ” అని యిట్లు చెప్పఁ దొడంగెను !

“ఏ యే యుగములం దే యే ధర్మములు చెప్పఁబడినవో వాని నన్నిటిని శ్రద్దగాఁ బరిశీలింపవలయునే కాని యా ధర్మములను గాని యా ధర్మ ప్రవక్తలను గాని యెంతమాత్రము నిందింపరాదు. వైశ్వదేవ మొనర్పక భుజించు బ్రాహ్మణుఁడు కాకియై పుట్టును. బ్రహ్మచారి, గృహస్థుఁడు, యతి, వానప్రస్థుఁడు - వీరికొఱకై నే నీ ధర్మశాస్త్రమును ప్రవ