పుట:MaharshulaCharitraluVol6.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

57


గల్గించును. కఱ్ఱ కఱ్ఱ ఱాపాడిన నగ్ని పుట్టును, అట్లని గొడ్డళ్ళతోఁ జెట్లఁ గూల్చి ముక్కముక్కలుగా చెక్కపేళ్ళుగాఁ గొట్టినచో అగ్ని కనిపించునా? అట్లే శరీరమును శుష్కింపఁ జేసినంతమాత్రమునఁ బరతత్త్వము కానిపింపదు. కఱ్ఱలకు మథన మవసరమైనట్లు జ్ఞానమునకు ఆగమోక్తమథన మావశ్యకము. ఆకాశమునఁ జూపు నిలువనంత మాత్రమున నాకాశమే లేదనుట యెంత యవివేకమో మనస్సునకు నింద్రియములకు నందనంత మాత్రమునఁ బరతత్త్వము లేదనుటయు నంతియే. వేఁటకాఁడు వల, ఉరి, ఓదము, గాలము మున్నగుసాధనములఁ గొని మృగమును, పక్షిని, ఏనుఁగును, చేఁపను, పట్టునట్లే జ్ఞానులు విజ్ఞానమునఁ బురుషునిఁ జూడఁ గందురు. పాముకాళులు పామునకే తెలియునట్లు బుద్ధివికారములను బోఁద్రోచు ప్రాజ్ఞుఁడు పరమపురుషు నెఱుంగును. అమావాస్యనాఁడు చంద్రుఁడు కానరానంతమాత్రమున నాతనికి నాశము లేనట్లే. మనస్సునకుఁ బట్టువడనంత మాత్రమునఁ బరవస్తువు లేదనుట బుద్దిహీనత. రాహువు మ్రింగినచో రవిబింబము కానరాదు. రాహువు విడువఁగనే యది యథాప్రకారము కాననగును. అట్లే ఆత్మకు అవిరతి, విరతి యనునవి అజ్ఞానమువలననే ఉన్నట్లు తోఁచును. తేఱిననీటఁ బ్రతిబింబము కనిపించును. కలఁగిననీట నది కనిపింపదు. అట్లే మనస్సు ప్రశాంతస్థితి నున్నపుడు పురుషుఁడు తన్నుదాను గనును. అశాంతస్థితిని గానలేఁడు. ఇంద్రియములు యథేచ్ఛముగాఁ దిరిగినచో నవి యనంతదుఃఖములం గొని తెచ్చును. అవి కట్టువడినచో సుఖ మొసంగును. కావున, ఇంద్రియము లను దొంగలబారి నుండి ఆత్మను గాపాడవలయును. మెఱుఁగుటద్దమున ముఖము బాగుగఁ గనఁబడునట్లే, పొపరహితమైన మనస్సున పురుషుఁడు తన్నుఁ దాఁ గనఁగలఁడు. ధ్యానయోగనిశ్చలమగు మనస్సు గుణములను విడిచి శాంతనిర్గుణవస్తువునందుఁ గలియును. అది పరమపదము. దానికిఁకఁ బరము లేదు.

ఉత్తమజ్ఞానమునకు మాయ మాటగును. దానిని దొలఁగించు నుపొయముఁ జెప్పెద, వినుము. భూమిపైఁ బాదము మోపని జంతు వెటు లేగెనో చెప్పుట యెంత కష్టమో మాయ యిట్టి దని చెప్పుట