పుట:MaharshulaCharitraluVol6.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జైగీషవ్యమహర్షి

33


 చుట్టము పగ యనుభేదం
 బెట్టి జనులవలనఁ దగుల దెల్లప్పుడు నె
 ప్పట్టున నద్దానను మదిఁ
 బుట్టదు సంతోషహాని బుద్ధాత్మునకున్.

 ఇంద్రియముల గెల్చి హృదయంబు శాంతిసు
 ఖంబుఁ బొంద నిర్వికారవృత్తి
 యైనవానిపొందు మానితగతి దేవ
 తలకుఁ బొంద నరిది ధర్మనిరత !”
            (భార. శాంతి. 5, 22-27.)

అని పలికెను. దేవలుఁ డిది విని ద్వంద్వాతీతస్థితి నంది చెలు వందెను.

జై గీషవ్యుని పార్వతీపరమేశ్వరులు పరీక్షించుట

జై గీషవ్యుఁడు పార్వతీపరమేశ్వరులు మేరుపర్వత ప్రాంతమున విహరించుచున్న సమయమునఁ బోయి యీశ్వరసన్నిధిని గూర్చుండెను.

పరమేశ్వరుని పరివార మంతయు నట విడిసియుండెను. సిద్ధసాధ్యయక్షగంధర్వాప్సరోగణములు వారిని సేవించు నవకాశమున కెదురుచూచుచుండెను. ఆ సమయమున పార్వతీపరమేశ్వరుల ప్రసంగవశమున పార్వతి “దేవా! అర్థ మేది ? అర్థశక్తి యేది? దయ దలఁచి తెలుపు" మని భర్తను ప్రార్థించెను. పరమేశ్వరుఁ డిట్ల నెను. "దేవీ ! అర్థమును నేను. అర్థశ క్తివి నీవు. నేను భో క్తను. నీవు భోజ్యమవు. నేను వరుఁడను. నీవు ప్రకృతివి. విష్ణుఁడను, బ్రహ్మను, యజ్ఞపురుషుఁడను నేనే.” “నాథా ! అర్థము, అర్థశక్తి వీనిలో నేది యధిక" మని పార్వతి పరమేశ్వరు నడిగెను. ఆతఁడేమియు సమాధానము చెప్పక మిన్నకుండెను. అపుడు జై గీషవ్యుఁడు "తల్లీ ! అర్థమే అధికమైనది. అర్థశక్తి యర్థమునందు లయించియున్న" దని బదులుచెప్పెను. తాను తనభర్తను బ్రశ్నింపఁగా సమాధాన మిచ్చుటకు వీఁడెవఁ డనియు, తన్నడుగనిదే పలుకుట కాతని కెంతకండకావర