పుట:MaharshulaCharitraluVol6.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మహర్షుల చరిత్రలు


పరిస్థితులను బట్టి శబ్దార్థము మాఱుచుండును. కావున, వానికిసంబంధ మున్నది, లేదు ” అని శ్వేతకేతుఁ డనెను. "ఐనచో నది పరస్పర . విరుద్ధముగాలేదా?” యని సువర్చల పలికెను. "కాదు. వై రుధ్యమేమియు లేదు. నే ననుశబ్ద మాత్మపరమైనపుడు సత్యము, అనాత్మపరమైనపు డసత్యము. అందుచే నది సత్యము నసత్యమును. మఱియు బ్రహ్మ సత్యము. జగత్తు మిథ్య. మిథ్య యగు జగత్తు లేదా ? ఉన్నది. నిజమున కున్నదా ? లేదు. ఇది తథ్యమిథ్యాతత్త్వము. ఇది తెలిసికొనుట కష్టము. కావున, ఆత్మవాచ్యశబ్దార్థము పరమేశ్వరుఁడు, అనాత్మాశ్రితశబ్దార్థములు రెండును మిథ్య" అని శ్వేతుకేఁతువు బదులు చెప్పెను.

“ఆత్మ, అహంకారము వీనినిగూర్చి తెలుపు” మని సువర్చల యడుగఁగా శ్వేతకేతు విట్లు తెలిపెను. "కాంతా ! మట్టియందు ఘట మనుభావ మున్నట్లు, ఆత్మయందు అహంకారము కల్పితమైయున్నది. అచింత్యము, పరము నై నది, ఆత్మవస్తువు. దీనియందు “ నేను నాది, నీవు, నీది, ఇది' అనునవి కల్పితములు. ఈ భావమే అహంకారము. లోకమున నాకాశ మున్నది. కాని రెండింటికి సంబంధములేదు. అదే విధముగాఁ బరిశుద్ధ మగుపర బ్రహము (తెలుప, చూప, శక్యము కానిది) - నుండి జగ ముద్భవించినను దానికి దీనికిని సంబంధము లేదు. మఱియు, ఆకాశమును ముట్ట, పట్ట వీలు లేకపోయినను, వాయువును త్వగింద్రియము చేతను, వాసనను ఘాణేంద్రియముచేతను, చీఁకటి, వెలుఁగు, మేఘములు, నక్షత్రములు మున్నగువానిని చక్షురింద్రియము చేతను మానవుఁడు తెలిసికొనఁగలుగుచున్నట్లు సద్రూప మగు పర బ్రహ్మము ఆకాశమున కాకాశ మని చెప్పఁబడుచున్నను విష్ణ్వాద్యవ తారములచేఁ జూడఁబడుచు, బుద్ధిచేఁ జింతింపఁబడుచు నున్నది. జల మొక్కటే యైనను, అది ప్రవహించు తావులను బట్టి రుచి భేదములను బొందుచున్నట్లే ఆత్మవస్తువుకూడఁ బ్రకృతిసంబంధమువలన వివిధములుగాఁ దోఁచుచున్నది. ఎచ్చటిపరిశుభ్రజలమైనను ద్రావి మానవుఁడు తృప్తిపడునట్లు, ఏరూపమున భావింపఁబడుచున్న పరమాత్మను . సేవించియు నరుఁ డుత్తమఫలితమును బొందఁగలుగును. పర