102
మహర్షుల చరిత్రలు
మూఁడవఅధ్యాయమున బ్రహ్మచారికి సంబంధించిన యనేకవిషయములవర్ణనము, గాయత్త్రీ మంత్రసారవర్ణనము, నిత్యనై మిత్తిక విధివర్ణనము, నాలుగవ అధ్యాయమున శ్రాద్ధవిషయవర్ణనము, ఐదవయధ్యాయమున అదే విషయముయొక్క వివరణము, ఆఱవ అధ్యాయమున అశౌచ వర్ణనము, ఏడవ అధ్యాయమున గృహస్థు లొనరింపఁదగిన ప్రేతకర్మ విధివర్ణనము, ఎనిమిదవ అధ్యాయమున ప్రాయశ్చిత్తవర్ణనము, తొమ్మిదవ అధ్యాయమున ఆ విషయముయొక్క విపులీకరణము అను విషయములు ఔశనసస్మృతిలోఁ గలవు. మచ్చు శ్లోకములు :
"కృతోపనయనో వేదా నధీయీత ద్విజోత్తమః,
గర్భాష్టమే వ్యష్టమే వా స్వ సూత్రోక్త విధానత :
దండే చ మేఖలా సూత్రే కృష్ణాజినధరో మునిం
భిక్షాహారో గురుహితే వీక్షమాణా గురోర్ముఖం
....... ......... .......... ......... ..........
......... ........ ........... ......... ...........
ఉపాసనే గురూణాం చ సాంధ్యయో రుభయోరపి,
ఉపవీతీ భవేన్నిత్యం విధి రేషః సనాతనః.
......... .......... .......... ......... ..........
........ .... ..... ......... .......... ..........
అమావాస్యాయాం యో బ్రాహ్మణం సముద్దిశ్య పితామహమ్,
బ్రాహ్మణీస్త్రీం సమభ్యర్బ్య ముచ్యతే సర్వపాతకై :
అమావాస్యాం తిథిం ప్రాప్య యమమారాధయేద్భవమ్,
బ్రాహ్మణానాం భోజయిత్వా స్సర్వపాపై : ప్రముచ్యతే.
కృష్ణాష్టమ్యాం మహాదేవం తథా కృష్ణచతుర్దశీం,
సంపూజ్య బ్రాహ్మణముఖై : సర్వపాపై ః ప్రముచ్యతే.
త్రయోదశ్యాం తథా రాత్రౌ సోపహారం త్రిలోచనమ్,
దృష్ట్వేవ ప్రథమో యామో ముచ్యతే సర్వపాతకైః.
సర్వత్ర దానగ్రహణే ముచ్యతే సోమయాగతః.