పుట:MaharshulaCharitraluVol6.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

101


నేఁ జెప్పినమాటలు పాటించి కులము, రాజ్యము, తేజము నిలుపుకొనుము. ఈ దానము గీనము మానుము.”

ఆ మాటలు విని బలిచక్రవర్తి "ఆచార్య! నీవు నిజము చెప్పితివి. గృహస్థులకు నీవు చెప్పినదే పరమధర్మము. కాని, నే నీదాన మిచ్చి తీరెద" నని పలికి శుక్రుని పలుకులు పాటింపఁ డయ్యెను. కాని, శుక్రాచార్యుఁ డొనరించిన హితబోధవలన నాతఁ డాగతానాగతవర్తమానవేది యాచార్య ధర్మనిర్వహణబుద్ధి యని వెల్లడియైనది,

ఔశనససంహిత

ఉశనసుఁడు అనులోమప్రతిలోమజాత్యంతర వివాహములనుగూర్చి చెప్పినధర్మములు ఔశనస సంహిత యని ప్రసిద్ధిగాంచినవి. ఈ సంహిత పూర్తిగా లభింప లేదు. లభించిన సంహితలో ఆరంభమున " అతఃపరం ప్రవక్ష్యామి జాతివృత్తివిధానకం, అనులోమవిధానం చ ప్రతిలోమవిధింతథా" అని కలదు. (ఇంతకుఁ బూర్వ మేదియో చెప్పి యుండ వచ్చు. ఈ సంహితనే ఔశనసధర్మశాస్త్రమనియు, ఔశనసస్మృతి, శుక్రస్మృతియనియు నందు రని తుదిఁగలదు.) ఇందు 51 శ్లోకములు మాత్రమున్నవి 51 వ శ్లోకము :

“ఏతత్సంక్షేవతః ప్రోక్తం జాతివృత్తివిభాగశః,
జాత్యంతరాణి దృశ్యంతే సంకల్పాదిత ఏవ తు. "

ఔశనసస్మృతి

ఇదియే ప్రధాన మగు శుక్రధర్మశాస్త్రము. శౌనకాది మహామునులు భార్గవుఁడగు ఉశనసునిఁజేరి ధర్మశాస్త్ర వినిర్ణయ మొనరింపు మని ప్రార్థించిరి. ధర్మతత్త్వవిదుఁ డగు ఉశసుఁడు ధర్మార్థకామమోక్షహేతువు, పాపనాశనకరము సగుధర్మశాస్త్రమును మొదటఁ దండ్రికి నమస్కరించి ప్రారంభించి చెప్పెను. మొదటి అధ్యాయమున బ్రహ్మచారిధర్మసార వర్ణనము, రెండవ అధ్యాయమున బ్రహ్మచారిశౌచాచారవర్ణనము,