పుట:Maharshula-Charitralu.firstpart.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మహర్షుల చరిత్రలు


గజకచ్ఛపములఁ జేతుల నిఱికించుకొని గంధమాదన పర్వతమునఁ దపముచేయు తండ్రికడ కేఁగి మ్రొక్కెను. కశ్యపుఁ డది గ్రహించి యా వాలఖిల్యుల నందుండి మఱియొక చోటికిఁ బొండని వేఁడు కొనెను. వా రా శాఖను విడిచి హిమగిరి కరిగిరి. కశ్యవుఁ డా శాఖను నిష్పురుష నగమున విడువు మన గరుడుఁ డతివేగమున నట్లుచేసి హిమగిరిపై దిగి గజగచ్చపముల భక్షించి మహాబల సంపన్నుఁడై యమృతము గొనివచ్చి మాతృశాప విమోచనముఁ గావించెను.[1]

భూమి కాశ్యపి యనఁబరగిన విధము

పూర్వము పరశురాముఁ డిఱువదియొక్కమాఱు నేల నిఃక్షత్త్రము గావించి యా పాపవిముక్తికై యశ్వమేధయాగమును జేసి యది పరిపూర్తి యైనంతనే కశ్యప మహర్షి ని బిలిచి భూమియంతయుఁ దక్షిణగా నిచ్చివేసెను. కశ్యపమహర్షి లోకసంరక్షణార్ధ మది గ్రహించి రాజవంశమునకు నిశ్శేషత్వము కలుగకుండుటకై పరశురాముని దక్షిణాబ్ది పారదేశమునకుఁ బొమ్మనెను. పరశురాముఁడు శూర్పాకార ప్రదేశము సముద్రుఁడు నిజహారమున కీయ నందుఁ దపోనియతినుండెను, కశ్యపమహర్షి భూమినంతను భూసురుల కిచ్చి తపోవనమున కేఁగెను. నాఁటినుండి భూదేవి 'కాశ్యపి ' యని పిలువఁబడుచున్నది,

గంగ కాశ్యపి యనఁబరగిన విధము

తొల్లి యొకప్పుడు కశ్యపప్రజాపతి మహర్షులను దర్శింప నైమిశారణ్యమున కేఁ గెను, అపు డందలి ఋషులు బహు భక్తి సత్కృతులతో నాతనిని బూజించిరి. కశ్యపుఁడు వారి యోగక్షేమము లడిగి యాదిరించిన సమయమున వారు “తాపసేంద్రా! మాకు సర్వకాలసర్వావస్థలయందును స్నానపానాదుల కనుకూల మగు నది యొకటి కావలయును. నీవు సర్వలోక సంరక్షణసమర్ధుఁడవు. నీ పేర

  1. భారతము - అదివర్వము.