పుట:Maharshula-Charitralu.firstpart.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

మహర్షుల చరిత్రలు


నను ద్యాదశాదిత్యులను గనెను. కశ్యపునివలన దితికి హిరణ్యాక్షుఁడు హిరణ్యకశిపుఁడు జన్మించిరి. దనువునకు విప్రచిత్తిశంబరాదిచానవులు నలువం డ్రుదయించిరి. కాల యనుదానికి వినాశన క్రోధాదు లెనమండ్రుగురు పుట్టిరి. అనాయు వనునామెకు బలవీరాదులు నలుగురు పుట్టిరి. సింహికకు రాహువు కలిగెను. ముని యను భార్య భీమ సేనోగ్ర సేనాధు లను గంధర్వులఁ గనెను. కపిలకమృతము, గోగణము. బ్రాహ్మణులు, ఘృతాచీమేనకాదు లగు నప్సరసలుఁ బుట్టరి, క్రోధ యను నామెకుఁ గ్రోధపశగణములు జనించెను. ప్రథ యను నామెకు సిద్ధాదులును, క్రూరకు సుచంద్ర చంద్రహంత్రాదులును బుట్టిరి.[1]

కశ్యపప్రజాపతికిఁ గద్రూవినతలవలని సంతతి

తరువాతఁ గొంతకాలమునకుఁ గద్రూవినతలు కుమారులఁ గాంచు నుద్దేశముతోఁ గశ్యపమహర్షి కడ కేఁగి యనేక సహస్రవర్షము లాతని నారాధించిరి. కశ్యపు డంత వారీ సేవ కానందించి వరములు వేఁడుకొనుఁ డనెను. అందుఁ గద్రువ వేయిమందిని వినత యా వేయిమందికంటె బలాధికులైన యిద్దఱు పుత్త్రులను గోరుకొనెను. కశ్యపమహర్షి యట్లే యని వారి కోర్కెఁ దీర్చుట కుగ్రతపము చేసెను. తరువాత గశ్యపుఁ డింద్రాది దేవతలను వాల ఖిల్యాది ఋషిగణములను దనకు సహాయులఁ జేసికొని పుత్త్రకామేష్టి యొనరించెను. ఆయజ్ఞమున నంగుష్ఠమాత్ర దేహులు ననవరతోపవాసకృశీభూత గాత్రులు నగు వాలఖిల్యాదులఁ జూచి యింద్రుఁడు నవ్వెను. అంత వా రాతనిపైఁ గోపించి యింద్రునికంటెను నూఱురెట్లు బలవంతుఁడగు పుత్త్రుఁడు కశ్యవున కుదయించి రెండవ యింద్రుఁ డగుఁ గాక యని మహామంత్రములతో వేల్వఁ దొడగిరి. ఇంద్రుఁడు భయ కంపితుఁడై కశ్యపుని శరణు వేఁడెను. కశ్యపమహర్షి లోకసంరక్ష

  1. భాగవతము - చతుర్దస్కంధము.