పుట:Maharshula-Charitralu.firstpart.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

కశ్యప మహర్షి

మరీచిమహర్షి బ్రహ్మాదులతోఁ గూడి దేవహూతీకర్దములకు జనించిన విష్ణుమూర్తి యగు కపిలమహర్షినిఁ జూడవచ్చెను. అప్పుడు కర్దమప్రజాపతి మరీచిమహర్షిని దన యింట నుంచుకొని తన కూఁతుండ్రలో నొకతె యగు కళనిచ్చి వివాహము చేసెను. అట్లు వివాహితుఁడై మరీచిమహర్షి భార్యాసహితుఁడై తపోవనమున కేగి సుఖముండెను.

అంతఁ గొంత కాలమునకుఁ గళకు మరీచిమహర్షి దయచే గర్భము సంభవింపఁ గాలక్రమమున నామె మగశిశువును గనెను. మరీచిమహర్షి కుమారుఁడు ప్రజాపతి యగు ననియు నాతనిని జాగ్రత్తగాఁ గాపాడు మనియు భార్యకుఁ జెప్పి యాతనికిఁ గశ్యప నామమొసఁగి యుక్తకాలమున నుపనయనాది సంస్కారము లొనర్చి తపోవనమున కేఁగెను.

కశ్యపమహర్షి సంతానము

కశ్యపుఁడు తరువాతఁ బెరిఁగి పెద్దవాఁడయ్యెను. బ్రహ్మ నియోగింప దక్షప్రజాపతి తనకుఁ గల్గిన పుత్తికలలో నదితి, దితి. దనువు, కాల, అవాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రథ, క్రర, వినత, కద్రువ లను వారిని గశ్యపుని కిచ్చి వివాహము చేసెను. కశ్యపమహర్షి తన భార్యలందఱకు సంసార సౌఖ్యము నొసఁగి పుత్త్రుల నిచ్చెద నని వచించెను. కొంతకాలమునకుఁ గశ్యపమహర్షి కృపచే నదితి ధాత, మిత్త్రుఁడు, అర్యముఁడు, శుక్రుఁడు, వరుణుఁడు. అంశుఁడు, భగుఁడు, వివస్వంతుఁడు, పూషుఁడు, సవితృఁడు, త్వష్ట, విష్ణుఁడు