పుట:Maharshula-Charitralu.firstpart.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

మహర్షుల చరిత్రలు


డనియు మహేశుఁ డనియు నొప్పుచుండును; ఆత్ముఁడు పరమునఁ దగులును; పరము మోక్షమునఁ దగులును మోక్ష మింక నెందును దగులదు, పదునాఱు వికారములు గల ప్రకృతి యాత్మ కాశ్రయము. ఆత్ముఁడు ప్రకృతివికృత్యతీతుఁడు. ఆత్మునకు రెండు రూపములున్నవి. ఒకటి విషయములందును రెండవది మధ్యస్థభావమునందును బ్రవర్తిల్లును. ప్రాణాపాన వ్యానో దానసమానములను నై దువాయువులు నాతనివి. వీనివిధము నెఱిఁగినఁ గలుగుజ్ఞాన మంతరాత్మునిఁ జూపును. గర్భవాస దుఃఖము, జన్మవ్యధ, బాల్యవిమూఢత్వము, రాగము, క్లేశము, వార్దక్యము, వీని వలనఁ గలుగు కృపణతలు గుర్తెఱిఁగి సంగముఁ బాసి యాత్మునిఁ గని మోక్ష మందఁదగును. దేహగుణాదిదోషముల నెల్లఁ ద్రోచు మార్గములను గ్రహించి యామార్గ పరిచయమున విష్ణుమాయచేఁ దోఁచు విశ్వమంతయు బుద్బుద ప్రాయముగా ఫేన సదృశమై మృద్ఘటములఁబోలి యున్న దని గ్రహించి దానిని లక్ష్య పెట్టక మోక్షమార్గము నరయుటయే సాంఖ్యము. కపిలమహర్షి బోధించిన యీ సాంఖ్యదర్శనము ప్రజాపతిపూజ్యమై, వేదశాస్త్ర పురాణ విదిత పరిజ్ఞానముల కెల్లఁ జేగుగడయై బ్రహ్మభావ భాజనతకు సరిలేని సమ్యగు పాయమై వెలసినది, ఇదియే షడధ్యాయవిలసితమై, త్రివిధ దుఃఖాత్యంత నివృత్త్యత్యంత పురుషార్థాదికనిగదనమై “కపిలస్మృతి" యనఁ బరగుచున్నది.[1]

కపిలుని భక్తియోగము

కపిలమహర్షి మాతృదేవికి భక్తియోగమును బోధించెను. తామస రాజస సాత్విక మను భేదములఁ ద్రివిధముల భక్తియోగము నిట్లు నిరూపించెను. 'నిత్యము హింసాపరుఁడై దంభ మాత్సర్యాదుల కాలవాలమై యొప్పు చున్నను, భేదదర్శియై భగవద్భక్తుఁ డగు వాఁడు తానుస భక్తుఁడు. విషయ సుఖములఁ బ్రవీణుఁడై

  1. భారతము - శాంతిపర్వము.