పుట:Maharshula-Charitralu.firstpart.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

మహర్షుల చరిత్రలు


పూర్వ మొకప్పు డశ్వశిరుఁ డను మహారా జనేక యాగములఁ జేసి యనేక విధముల బ్రాహ్మణులను సత్కరించుచుండెను. కపిలమహర్షి యశ్వశిరుని యోగ్యత యెఱిఁగి యాతనిఁ గటాక్షించు నుద్దేశముతో నొకమాఱు. జైగీషవ్యుఁ డను ముని వెంటరాఁగా నశ్వశిరుని గృహమున కేఁగెను. నాఁ డశ్వశిరుఁడు యజ్ఞదీక్షితుఁడై బ్రాహ్మణుల కనేకభూరి దక్షిణ లిచ్చి సమ్మానించెను. ఆతఁడు కపిల జైగీషవ్యుల నెంతయు నాదరించి పలువిధములఁ బూజించెను. తరువాత నశ్వశిరుఁడు కపిలమహర్షికి మ్రొక్కి “మహాత్మా! మీరాకచే నేను ధన్యుఁడనైతిని. విష్ణుమూర్తి కటాక్షసంపాదనకు నే నేమి చేయవలయునో తెలుపుఁ"డని కోరెను. అంతఁ గపిలమహర్షి "రాజా! నేనే విష్ణుమూర్తిని. నన్నుఁ బూజించిన నీవు కృతార్ధుఁడ వగుదువు. నేనుగాక వే ఱొక విష్ణుమూర్తి కలఁడని యెంచుటకన్న సవివేకము లే" దని పల్కెను. ఆశ్వశిరుఁడామాటల కాశ్చర్యము నంది యాతని యహంభావమున కసహ్యించుకొనెను. కాని, కపిలమహర్షి నేమియు ననఁ జాలక “మహాత్మా ! విష్ణుమూర్తిని నేనెఱుఁగుదును. ఆతఁడు శంఖచక్రగదాపాణి గరుడవాహనుఁడు గదా! నీవే విష్ణుమూర్తివన్న నవి నీకు లేవుగదా" యనెను. ఈమాట లశ్వశిరుని నోటినుండి వెలువడఁగానే కపిలమహర్షి విష్ణుస్వరూపుఁడై శంఖచక్రగదాపాణి యయ్యెను. జైగీషవ్యుఁడును గరుడుఁడై యాతని వాహన మయ్యెను. అంత నశ్వశిరుఁడు తన నేత్రములను నమ్మజాలక యది యంతయు మోసమనియు విష్ణుమూర్తి కమలనాభుఁ డనియు బ్రహ్మ యందుండి జన్మించెననియు నట్లు లే దేమని యడిగెను. వెంటనే కపిలమహర్షి కమలనాభుఁ డయ్యెను. అంత జైగీషవ్యుఁడు బ్రహ్మయై నిలచెను. దిన, నశ్వశిరుఁడు నమ్మఁజూలక యది యంతయు మోసమే యనియుఁ గపిలమహర్షి విష్ణుమూర్తికాఁ డనియు ననెను. వెంటనే