పుట:Maharshula-Charitralu.firstpart.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మహర్షుల చరిత్రలు


దలు క్షణికములనియు, పరహింసా వ్యాపారములు పాపహేతువులనియు, నెఱిఁగి భయపడుచు గురుపాదము లాశ్రయించి తత్వ మెఱిఁగి దృఢనిశ్చయుఁడై మెలఁగ వలయును. అట్లు మెలఁగువారు మూఁడు రకములు ; అంకురితులు, పుష్పితులు, ఫలితులు, మోక్ష ధర్మాపేక్షగలవా రంకురితులు ; తదాచార నిరతులు పుష్పితులు ; జీవన్ముక్తులు ఫలితులు. వీరు గురుబోధితజ్ఞానమున మోక్షమందుదురు." ఇట్లు బోధించి కపిలుఁ డాతనిని వీడ్కొలిపి నిజాశ్రమమునకు విచ్చేసెను.

తదనంతరము పుండరీకుఁడు సర్వసంపదలను రోసి వైరాగ్య యుతుఁడై కపిలమహర్షి యాశ్రమమునకు విచ్చేసి తన్ను శిష్యునిగా ననుగ్రహించి తపముచేయ ననుమతింపు మని యాతనిఁ గోరెను. కపిలుఁ డాతనిఁ గన్నెత్తిచూడక నోటఁ బలుకక తృణీకరించెను. కాని, పుఁడరీకుఁడు పదమూడు దినము లటనే జలాంజలిత్రయ పానమాత్రముసఁ గదలక మెదలక కపిలునే ధ్యానించుచు నుండెను. పదునాలవ దినమునఁ గపిలుఁడు శిష్య సహితుఁడై సంధ్యాద్యనుష్ఠానములఁ దీర్చి యాతనిఁ బలుకరించి యాతని మనస్సు రాజ్య సతీ పుత్రాదులపై మరలింప యత్నించెను. కాని పుండరీకుఁడు నిజమగు విరాగమున నుండుటచేఁ జలింపఁడాయెను. కపిలుఁ డపుడు సంతసించి యాతనికి గర్మ భక్తి వైరాగ్య జ్ఞాన యోగములు బోధించి

"పరాయ సరరూపాయ
           పరమాత్మన్ పరాత్మనే
 నమః పరమ తత్త్వాయ
           పరానందాయ ధీనుహి"

అను మహామంత్రము నుపదేశించి యనుగ్రహించెను.

పుండరీకుఁ డట్లు కపిలమహర్షినే గురువుగా భావించి యాతని యుపదేశామృతమునఁ బునీతుఁడు శ్రద్ధా భయభక్తి యుక్తుఁడై చిర - -